సర్దార్ విరాట్ కోహ్లీ.. సడన్‌గా ఈ కొత్త గెటప్ ఎందుకో?

క్రికెట్ ఫ్యాన్స్ కోహ్లీ మీద తెగ సెటైర్లు వేస్తున్నారు. అయినా, కోహ్లీ కానీ, ఆర్సీబీ కానీ దీన్నేమీ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు.

news18-telugu
Updated: April 17, 2019, 7:47 PM IST
సర్దార్ విరాట్ కోహ్లీ.. సడన్‌గా ఈ కొత్త గెటప్ ఎందుకో?
పింక్ టర్బన్‌లో విరాట్ కోహ్లీ
news18-telugu
Updated: April 17, 2019, 7:47 PM IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త గెటప్‌తో ఉన్న ఫొటోను తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. అచ్చమైన పఠానీ గెటప్‌లో అదిరిపోతున్నాడు. తలకి పింక్ కలర్ తలపాగా, లాల్చి పైజామా, చేతులకు కడియం, అందుకు తగ్గట్టుగానే తన నేచురల్ గడ్డానికి తోడు చేతులు జోడించి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. అయితే, ఇంత సడన్‌గా ఈ గెటప్‌లో కోహ్లీ ఎందుకు కనిపించాడనే డౌట్ అందరికీ రాకమానదు. కొన్ని రోజుల క్రితమే సిక్కులు తమ కొత్త ఏడాది బైసాఖి జరుపుకొన్నారు. దానికి గుర్తుగా కోహ్లీ ఈ ఫొటోను పోస్ట్ చేశాడా? లేకపోతే ఏదైనా ప్రకటనలో భాగంగా ఈ కొత్త గెటప్ వేశాడా? అనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో ఐపీఎల్‌లో కోహ్లీ కెప్టెన్సీ వహిస్తున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ ఘోరంగా ఓడిపోతోంది. పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఉంది. ఈ విషయంలో క్రికెట్ ఫ్యాన్స్ కోహ్లీ మీద తెగ సెటైర్లు వేస్తున్నారు. అయినా, కోహ్లీ కానీ, ఆర్సీబీ కానీ దీన్నేమీ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. 


View this post on Instagram
 

Sat Shri Akal saarreyaan nu! 🙏🏼


A post shared by Virat Kohli (@virat.kohli) on
First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...