టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి పెద్ద రచ్చే జరిగిందని నెట్టింట్లో కోడై కూస్తున్నారు. అయితే, తమ ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని ఈ మధ్యే విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. భారత జట్టులో వివాదాలకు చోటు లేదని, కలిసి మెలిసి ఉన్నామని అందుకే తమ జట్టు నంబర్ వన్‌గా ఉందని స్పష్టం చేశాడు. రోహిత్‌తో తనకు వివాదం ఉన్నట్లు వస్తున్న వార్తలన్నీ కల్పితాలేనని, ఓ సారి డ్రెస్సింగ్ రూమ్‌కు వస్తే తెలుస్తుంది తామెంత సరదాగా ఉంటామో.. అని గొడవ వార్తలకు తెరదించాడు. ఆ గొడవ అక్కడికే సమసిపోయి ఉండేది. కానీ, కోహ్లీ చేసిన ఓ పనికి.. ఇద్దరి మధ్య నిజంగానే వివాదం నడుస్తోందన్న ఊహాగానాలు మరింత పెంచాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా నెటిజన్లు వారిద్దరి మధ్య నడుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
SQUAD 👊💯 pic.twitter.com/2uBjgiPjIa
— Virat Kohli (@imVkohli) August 2, 2019
ఇంతకీ కోహ్లీ చేసిన పనేటంటే.. ట్విట్టర్ ఓ ఫోటో పోస్ట్ చేసి, దానికింద ఓ ఆశ్చర్యకర స్టేటస్ రాయడమే. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు.. జడేజా, భువనేశ్వర్, రాహుల్, తదితరులతో కలిసి ఉన్న ఓ ఫోటో పోస్ట్ చేసి.. ఇదే జట్టు అంటూ కామెంట్ పెట్టాడు. ఆ ఫోటోలో రోహిత్ శర్మ లేడు. కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేసిన ఓ ఫోటోలో కూడా రోహిత్ శర్మ లేడు. దీంతో నెటిజన్లు కోహ్లీ దుమ్ము దులిపేశారు. ‘రోహిత్‌తో విభేదాలు లేవంటున్నావ్.. మరి నువ్వు పోస్ట్ చేసే ప్రతి ఫోటోలో రోహిత్ మాత్రం ఎందుకు కనిపించడం లేదు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
Miami bound 😎💪🇮🇳 pic.twitter.com/ywIh0ePTuZ
— Virat Kohli (@imVkohli) July 29, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Sharma, Bcci, Cricket, Cricket World Cup 2019, ICC Cricket World Cup 2019, Rohit sharma, Team india, Virat kohli