Home /News /sports /

Virat Kohli: విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీపై నిర్ణయం.. మూడు రోజుల్లో సెలెక్షన్ కమిటీ భేటీ? వారిద్దరి చేతుల్లో విరాట్ భవిష్యత్

Virat Kohli: విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీపై నిర్ణయం.. మూడు రోజుల్లో సెలెక్షన్ కమిటీ భేటీ? వారిద్దరి చేతుల్లో విరాట్ భవిష్యత్

విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ.. ఉంటుందా? ఊడుతుందా? (PC: BCCI)

విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ.. ఉంటుందా? ఊడుతుందా? (PC: BCCI)

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 జట్టు కెప్టెన్సీని వదిలేశాడు. ప్రస్తుతం టెస్టు, వన్డే కెప్టెన్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఈ వారంలో భేటీ కానున్న సీనియర్ జాతీయ సెలెక్షన్ కమిటీ కోహ్లీ వన్డే కెప్టెన్సీ భవితవ్యంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.

ఇంకా చదవండి ...
    టీమ్ ఇండియా (Team India) టెస్టు, వన్డే కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీని (Virat Kohli) ఇకపై కేవలం టెస్టులకే పరిమితం చేయనున్నారా? ఆటగాడిగా మూడు ఫార్మాట్లలో కొనసాగించినా.. కెప్టెన్సీని మాత్రం తీసేయనున్నారా? ఇప్పటికే టీ20 (T20 Cricket) కెప్టెన్సీని వదిలేసిన కోహ్లీ.. పూర్తిగా వైట్ బాల్ కెప్టెన్సీకి దూరం కానున్నాడా? అంటే బీసీసీఐ (BCCI) వర్గాలు అవుననే అంటున్నాయి. భారత జట్టు ఈ నెల 8 లేదా 9న దక్షిణాఫ్రికా పర్యటనకు (South Africa Tour) బయలుదేరాల్సి ఉన్నది. ఆ పర్యటనలో మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. దీనికి సంబంధించి టీమ్ ఇండియా ఎంపిక నేడో రేపో జరుగనున్నది. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టు ఎంపికతో పాటు జాతీయ సీనియర్ సెలెక్షన్ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే పని భారం పెరిగిందని కోహ్లీ టీ20 కెప్టెన్సీని వదిలేశాడు. అయితే టెస్టు, వన్డే కెప్టెన్‌గా ఎంత కాలం కొనసాగుతాననే విషయాన్ని మాత్రం చెప్పలేదు.

    టీమ్ ఇండియా 2023 వన్డే వరల్డ్ కప్ కోసం సారధిగా ఎవరుంటారనే విషయం ఇప్పుడే తెలిసిపోనున్నది. ఈ ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్ కప్‌కు రోహిత్ శర్మ సారథ్యం వహించడం ఖాయమే. ఇక వన్డే వరల్డ్ కప్‌కు కోహ్లీ ఉంటాడా లేదా అనేది తేలాల్సి ఉన్నది. ఇప్పటి నుంచి మెగా టోర్నీ వరకు భారత జట్టు 9 వన్డేలు ఆడాల్సి ఉన్నది. అందులో ఆరు వన్డేలు విదేశాల్లో జరుగనున్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు వన్డేలతో పాటు వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో మరో మూడు వన్డేలు ఆడాలి. అయితే టెస్టు జట్టుకు పరిమిత ఓవర్ల జట్టుకు చాలా దేశాలు వేర్వేరు కెప్టెన్ల వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో టీమ్ ఇండియాకు కూడా ఈ ఫార్ములా అప్లై చేస్తారని భావిస్తున్నారు.

    IND vs NZ: కోహ్లీ ఫేట్ మారుతుందా? సెంచరీ చేయక 741 రోజులు.. వాంఖడేలో కోహ్లీకి అద్భుత రికార్డు


    అయితే కోహ్లీ మాత్రం వన్డే కెప్టెన్సీ వదిలేస్తానని ఇప్పటి వరకు చెప్పలేదు. ఆ నిర్ణయాన్ని బీసీసీఐకే వదిలేశాడు. జట్టు నుంచి కోహ్లీని ఇప్పట్లో తప్పించడం కష్టమే. కానీ కెప్టెన్సీ విషయంలోనే సెలెక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తున్నది. చేతన్ శర్మ అధ్యక్షతన త్వరలో సెలెక్షన్ కమిటీ భేటీ జరుగుతుంది. అయితే కోహ్లీ కెప్టెన్సీ విషయంలో మాత్రం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా నిర్ణయమే ఫైనల్ కానున్నది. బీసీసీఐలో కోహ్లీ కెప్టెన్సీ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయినట్లు సమాచారం. ఒక వర్గం అతడిని కొనసాగించాలని కోరుతుంటే.. మరో వర్గం మాత్రం రోహిత్‌కు ఇవ్వాలని సూచిస్తున్నది. దీంతో కోహ్లీ కెప్టెన్సీ భవిష్యత్‌ను గంగూలీ, జై షాల నిర్ణయానికి వదిలేశారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: Sourav Ganguly, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు