Virat Kohli: కోహ్లీ నయా క్వారంటైన్ లుక్.. ఆ పాత్రతో పోలుస్తూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ..

Photo Credit : Twitter

Virat Kohli: ఈ లుక్, కోహ్లీ కొత్త ఫోటో గురించి విశేషంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఈ ఫోటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. విరాట్ ను ఆ పాత్రతో పోలుస్తూ అతని ఫ్యాన్స్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తున్నారు.

  • Share this:
విరాట్ కోహ్లీ.. (Virat Kohli) పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా దేశానికి ఎన్నో కీలక విజయాలను అందించాడు. మైదానంలో రెచ్చి పోయే మన రన్నింగ్ మెషిన్ లుక్స్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎప్పుడు చిన్న గడ్డంతో, లైట్ హెయిర్ స్టైల్ తో ఉండే కోహ్లీ లాక్‌డౌన్ ప్రభావంతో ఎక్కువగా ఇంట్లోనే గడిపేస్తున్నాడు. ఫలితంగా లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో సరికొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్, కోహ్లీ కొత్త ఫోటో గురించి విశేషంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. మనీ హీస్ట్ వెబ్ సిరీస్ ప్రధాన పాత్రలో కనిపించిన ప్రొఫెసర్ మాదిరిగా విరాట్ ఉన్నాడని పోస్టులు పెడుతున్నారు అభిమానులు.మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఈ ఫోటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. చాలా మంది అభిమానులు ఐసీసీ 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసమే విరాట్ ఈ లుక్ లో కనిపించనున్నాడని కామెంట్లు పెట్టారు. జూన్ 18న న్యూజిలాండ్ సౌథాంప్టన్ లో వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో కివీస్ జట్టుతో తలపడనుంది టీమిండియా. ఈ క్రమంలో.. మనీ హీస్ట్ సిరీస్ లో ప్రొఫెసర్ మాదిరిగా కనిపిస్తున్నాడని ఒకరు పోస్ట్ చేయగా.. జూన్ 18న ఈ లుక్‌తో రాబోతున్నాడని మరోకరు స్పందించారు.

అయితే ఇది ఫోటోషాప్ చేసిన ఇమేజ్ అని ఇంకో అభిమాని కామెంట్ పెట్టాడు. ఈ వ్యాఖ్యను సమర్థిస్తూ మరో వ్యక్తి విరాట్ ఇటీవల పోస్ట్ చేసిన ఫొటోనూ జత చేశాడు. మొత్తానికి ఇది కోహ్లీ ఫోటో కాదని ఆ తరువాత అందరికీ తెలిసింది. ఎవరో ఫోటోను మార్ఫింగ్ చేసి ఇలా రూపొందించారని అభిమానులు చర్చించుకుంటున్నారు.






కోహ్లీ ఇటీవలే స్రవంతి నాయుడు అనే మహిళా క్రికెటర్ కు కోవిడ్ సహాయార్థం రూ.6.77 లక్షలు ఇచ్చాడు. స్రవంతి నాయుడు తల్లి ఎస్ కే సుమన్ ఇటీవలే కరోనా బారిన పడ్డారు. దీంతో సహాయం చేయాలని బీసీసీఐ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ట్విట్టర్ ద్వారా విన్నవించుకున్నారు. ఈ అంశంపై స్పందించిన విరాట్ ఆమెకు రూ.6.77 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. స్రవంతి నాయుడు భారత మహిళా జట్టు తరఫున ఓ టెస్టు, 4 వన్డేలు, 7 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. చివరగా 2014లో భారత్‌ తరఫున ఆడారు. ఇటీవల ఆమె తల్లిదండ్రులిద్దరూ కోవిడ్-19 బారిన పడ్డారు. ఇందుకోసం 16 లక్షలు ఖర్చు పెట్టానని, ఆర్థిక సహాయం చేయాలని ట్విట్టర్ వేదికగా కోరారు.
Published by:Sridhar Reddy
First published: