Virat Kohli: ఆ రికార్డుకు ఒక్క పాయింటు దూరంలో నిలిచిన కోహ్లీ...

ఈ నెల 19న రాంచీ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టు తర్వాత కోహ్లీ తిరిగి అగ్రస్థానానికి చేరుకుంటాడని అంతా భావిస్తున్నారు

news18-telugu
Updated: October 15, 2019, 10:25 PM IST
Virat Kohli: ఆ రికార్డుకు ఒక్క పాయింటు దూరంలో నిలిచిన కోహ్లీ...
(BCCI)
news18-telugu
Updated: October 15, 2019, 10:25 PM IST
ఐసిసి ప్రకటించిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానం దిశగా దూసుకెళ్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ 936 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలోఉన్నాడు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్ కన్నా కోహ్లీ ఒక్క పాయింట్ దూరంలో మాత్రమే నిలిచాడు. తొలి టెస్టు తర్వాత కోహ్లీ 899 పాయింట్లతో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 19న రాంచీ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టు తర్వాత కోహ్లీ తిరిగి అగ్రస్థానానికి చేరుకుంటాడని అంతా భావిస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల్లో అద్భుతంగా రాణించిన భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ టాప్ 20లో స్థానం సంపాదించాడు. ఇక బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అజయ్ జడేజా రెండో స్థానంలో నిలిచాడు.

First published: October 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...