కొత్త రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ...ఆ విషయంలో సచిన్‌ది వెనుకడుగే...

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో ఒక్కో దాంట్లో 30 మిలియన్ల చొప్పున ఫాలోయర్లు ఉన్న క్రికెటర్‌గా విరాట్ గుర్తింపు పొందాడు. అయితే విరాట్ తర్వాత స్థానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో నిలిచాడు.

news18-telugu
Updated: August 18, 2019, 7:29 PM IST
కొత్త రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ...ఆ విషయంలో సచిన్‌ది వెనుకడుగే...
విరాట్ కోహ్లీ(ఫైల్ ఫోటో)
  • Share this:
సోషల్ మీడియా ఫాలోయర్లలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో ఒక్కో దాంట్లో 30 మిలియన్ల చొప్పున ఫాలోయర్లు ఉన్న క్రికెటర్‌గా విరాట్ గుర్తింపు పొందాడు. అయితే విరాట్ తర్వాత స్థానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అయితే సోషల్ మీడియా ఫాలోయర్ల సంఖ్యలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే ట్విట్టర్‌లో సచిన్‌ను 30 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఫేస్‌బుక్‌లో 28, ఇన్‌స్టా‌గ్రామ్‌లో 16.5 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఏ మాత్రం యాక్టివ్‌గా ఉండని ధోనీని ట్విట్టర్‌లో 7.7, ఫేస్‌బుక్‌లో 20.5, ఇన్‌స్టా‌గ్రామ్‌లో 15.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు