విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌ ఇద్దరిలో మేటి ఎవరు?

అన్ని ఫార్మెట్లలోనూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీయే మేటి అంటూ ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మైఖేల్ వాగన్ అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: January 20, 2020, 9:33 PM IST
విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌ ఇద్దరిలో మేటి ఎవరు?
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ
  • Share this:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ ఇద్దరిలో మేటి బ్యాట్స్‌మన్ ఎవరు?  ఈ అంశంపై చాలాకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో స్టీవ్ స్మిత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఇద్దరిలో మేటి బ్యాట్స్‌మన్ ఎవరన్న చర్చ మళ్లీ తెరమీదకు వచ్చింది.  ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మైఖేల్ వాగన్ మాత్రం తన ఓటు విరాట్ కోహ్లీకే అంటున్నారు.  అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మెట్లలోనూ విరాట్ కోహ్లీయే మేటి అంటూ వాగన్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ కంటే స్టీవ్ స్మిత్  మేటి ఆటగాడన్న అభిప్రాయంతో వాగన్ విభేదించారు.

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కోహ్లీ సేన కైవసం చేసుకోవడం తెలిసిందే. ఆదివారం జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత జట్టు 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్టీవ్ స్మిత్(131) శతకంతో రాణించగా..విరాట్ కోహ్లీ(89) అర్ధ శతకంతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ(119) శతకం, కోహ్లీ అర్ధ శతకాలతో రాణించడంతో మూడేళ్ల తర్వాత బెంగుళూరు వన్డేలో స్టీవ్ స్మిత్ సాధించిన తొలి వన్డే శతకం వృధా అయ్యింది.

మూడు వన్డేల సిరీస్‌లో 229 పరుగులతో స్మిత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్‌లలో 183 పరుగులు సాధించాడు. ఐసీసీ వన్డే, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీయే అగ్రస్థానంలో కొనసాగుతుండగా...శ్రీలంక జర్నలిస్ట్ డేనియల్ అలెగ్జాండర్ మాత్రం అన్ని ఫార్మెట్లలో స్టీవ్ స్మిత్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అంటూ అభిప్రాయపడ్డారు. అయితే అతని అభిప్రాయంతో విభేదించిన మైఖేల్ వాగన్...విరాట్ కోహ్లీయే మేటి అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.


First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు