బౌలింగ్, బ్యాటింగ్‌లో మనోళ్లే టాప్...ఐసీసీ ర్యాంకింగ్స్ ఇదిగో

కెప్టెన్ విరాట్ కొహ్లీ టెస్ట్‌, వన్డే ఫార్మట్‌ రెండింటిలోనూ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బౌలింగ్‌లో టాప్-5లో టీమిండియా బౌలర్లే మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. బుమ్రా తొలిస్థానంలో ఉండగా..కుల్దీప్, చాహల్ 4, 5 స్థానాలు దక్కించుకున్నారు.

news18-telugu
Updated: February 4, 2019, 4:31 PM IST
బౌలింగ్, బ్యాటింగ్‌లో మనోళ్లే టాప్...ఐసీసీ ర్యాంకింగ్స్ ఇదిగో
కొహ్లీ, బుమ్రా (Reuters)
news18-telugu
Updated: February 4, 2019, 4:31 PM IST
ఆస్ట్రేలియా గడ్డపై కంగారూలను కంగారు పెట్టించారు. కివీస్ గడ్డపైనా న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించారు. విదేశీ పర్యటనల్లో దుమ్ము రేపుతున్న టీమిండియా ప్లేయర్స్.. ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లోనూ సత్తా చాటారు. వన్డే బౌలింగ్, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మనోళ్లే టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఇక జట్టు విషయానికొస్తే.. టెస్టుల్లో భారత జట్టే నెంబర్ వన్ స్థానంలో ఉంది. వన్డేలు, టీ20ల్లో రెండో స్థానానికి పరిమితమైంది. కెప్టెన్ విరాట్ కొహ్లీ టెస్ట్‌, వన్డే ఫార్మట్‌ రెండింటిలోనూ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బౌలింగ్‌లో టాప్-5లో టీమిండియా బౌలర్లే మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. బుమ్రా తొలిస్థానంలో ఉండగా..కుల్దీప్, చాహల్ 4, 5 స్థానాలు దక్కించుకున్నారు.

జట్టు ర్యాకింగ్స్ (వన్డే)
1. ఇంగ్లండ్ (రేటింగ్ 126)

2. భారత్ (122)
3. సౌతాఫ్రికా (111)


4. న్యూజిలాండ్ (111)
5. పాకిస్తాన్ (102)

జట్టు ర్యాకింగ్స్ (టెస్ట్)
1. ఇండియా (రేటింగ్ 116)
2. సౌతాఫ్రికా (110)
3. ఇంగ్లండ్ (108)
4. న్యూజిలాండ్ (107)
5. ఆస్ట్రేలియా (104)

బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్ (వన్డే)
1. విరాట్ కొహ్లీ -భారత్ (రేటింగ్ 887)
2. రోహిత్ శర్మ -భారత్ (854)
3. రాస్ టేలర్ -న్యూజిలాండ్ (821)
4. జో రూట్ -ఇంగ్లండ్ (807)
5. బాబర్ అజామ్-పాకిస్తాన్ (801)

బౌలర్ ర్యాంకింగ్స్ (వన్డే)
1. జాస్ప్రిత్ బుమ్రా-భారత్ (రేటింగ్ 808)
2. రషీద్ ఖాన్ -ఆఫ్ఘానిస్తాన్ (788)
3. ట్రెంట్ బౌల్ట్-న్యూజిలాండ్ (732)
4. కుల్దీప్ యాదవ్-భారత్ (719)
5. యుజ్వేంద్ర చాహల్-భారత్ (709
First published: February 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...