బుమ్రాను ఆటపట్టించిన కోహ్లీ...వీడియో వైరల్

Virat Kohli | టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రాను తనదైన స్టయిల్లో టీజ్ చేశాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ.

news18-telugu
Updated: July 10, 2019, 11:57 AM IST
బుమ్రాను ఆటపట్టించిన కోహ్లీ...వీడియో వైరల్
బుమ్రాతో కోహ్లీ(ఫైల్ ఫోటో)
  • Share this:
టీమిండియా ఆటగాళ్లు ఒకరితో ఒకరు ఎంత సరదాగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్రౌండ్‌లో కాస్త టెన్షన్‌గా కనిపించే కెప్టెన్ విరాట్ కోహ్లీ... బయట మాత్రం ఇతర ఆటగాళ్లతో ఎంతో సరదాగా గడుపుతుంటాడు. వారిని ఆటపట్టించడంలోనూ విరాట్ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఇండియా, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు చోటు చేసుకుంది. టీమిండియా ప్రధాన బౌలర్ బుమ్రాను తనదైన స్టయిల్లో ఆటపట్టించాడు విరాట్ కోహ్లీ. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించాడు విరాట్ కోహ్లీ.
బుమ్రా ఏ విధంగా బౌలింగ్ చేస్తాడో చేసి చూపించాడు కోహ్లీ. అంతేకాదు వికెట్ తీస్తే బుమ్రా ఏ రకంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాడో కూడా కోహ్లీ చేసి చూపించడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. బుమ్రాను టీజ్ చేసిన విరాట్ కోహ్లీపై కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుంటే... మరికొందరు మాత్రం అతడి ఫన్నీ బిహేవియర్ బాగుందని రిప్లై ఇస్తున్నారు.


First published: July 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు