Virat Kohli : కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలా? విమర్శకులకు టీమిండియా బౌలింగ్ కోచ్ సమాధానం

Kohli - Bharat Arun

Virat Kohli : ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రత్మాక టెస్ట్ సిరీస్ నెగ్గింది టీమిండియా. విరాట్ కోహ్లీ పితృత్వపు సెలవుల మీద స్వదేశానికి తిరిగి వస్తే..టీమిండియాకు అజింక్య రహానే కెప్టెన్సీ వహించాడు. ఓ వైపు గాయాలతో ప్లేయర్స్ దూరమైనా, సీనియర్లు లేకపోయినా..తనదైన కెప్టెన్సీతో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు జింక్స్. దీంతో కోహ్లీ ని కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ విన్పిస్తోంది.

  • Share this:
    ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రత్మాక టెస్ట్ సిరీస్ నెగ్గింది టీమిండియా. విరాట్ కోహ్లీ పితృత్వపు సెలవుల మీద స్వదేశానికి తిరిగి వస్తే..టీమిండియాకు అజింక్య రహానే కెప్టెన్సీ వహించాడు. ఓ వైపు గాయాలతో ప్లేయర్స్ దూరమైనా, సీనియర్లు లేకపోయినా..తనదైన కెప్టెన్సీతో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు జింక్స్. దీంతో కోహ్లీ ని కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ విన్పిస్తోంది. కోహ్లీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలన్న విమర్శకులపై బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీని విమర్శించే ముందు కెప్టెన్‌గా అతను సాధించిన ఘనతలను గుర్తు తెచ్చుకోవాలని సూచించాడు. అన్ని క్రీడల అత్యుత్తమ సారథుల్లో విరాట్ కోహ్లీ రెండోవాడని తెలిపాడు. కొందరు మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని రహానే, రోహిత్ శర్మలకు అవకాశాలివ్వాలని సూచించారు. ఈ విమర్శలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన భరత్ అరుణ్.. కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన విజయాలను మరిచి ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డాడు.

    " ముందుగా ఆస్ట్రేలియాలో కెప్టెన్‌గా అదరగొట్టిన అజింక్యా రహానే‌కు అభినందనలు. కానీ విరాట్ కోహ్లీకి వ్యతిరేకంగా రాసేవారికి నేను చెప్పేది ఒకటే. మొత్తం 20 సిరీస్‌లకు విరాట్ కెప్టెన్‌గా ఉండగా.. అందులో భారత్ 14 సిరీస్‌లు నెగ్గింది. అతని సారథ్యంలోనే 70 శాతం విజయాలు దక్కాయి.అన్ని రకాల క్రీడల్లో‌ని కెప్టెన్లను పరిశీలిస్తే.. విరాట్ కోహ్లీ రికార్డు అత్యుత్తమంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్ రగ్బీ టీమ్ 80 శాతం విజయాలు అందుకోగా.. ఆ తర్వాత కోహ్లీనే 70 శాతం విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీకి వ్యతిరేకంగా రాసేవారంతా అతను సాధించిన ఈ విజయాలను మరిచిపోయారు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టుకు ఏం తక్కువ చేశాడు? ఫిట్‌నెస్ కల్చర్‌ను జట్టులోకి తీసుకొచ్చింది అతనే. ఫాస్ట్ బౌలర్లు, ఫీల్డర్లు అందరూ విరాట్ సారథ్యంలోనే ఎదిగారు" అని భరత్ అరుణ్ తెలిపాడు.

    " రహానే జట్టును అద్భుతంగా నడిపించాడు. కాదనడం లేదు. విరాట్ కోహ్లీ ఉన్నా వైస్ కెప్టెన్‌గా రహానే అదే చేసేవాడు. విలువైన సలహాలను తన కెప్టెన్‌కు ఇచ్చేవాడు. సలహాలు, సూచనలు స్వీకరించే విషయంలో కోహ్లీ చాలా ఓపెన్‌గా ఉంటాడు. టీమిండియా నిర్భయంగా, దూకుడుగా ఆడుతుందంటే దానికి కారణం ఇద్దరే. ఒకరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే మరొకరు కోచ్ రవిశాస్త్రి. ఆటగాళ్ల మైండ్‌సెట్‌ను వారు పూర్తిగా మార్చారు. బాగా రాణించాలంటే ఏ జట్టుకైనా ఇలాంటి క్వాలిటీస్ అవసరం. అలా జట్టులో విరాట్, శాస్త్రి సమూల మార్పులు తీసుకొచ్చారు. 'అని భరత్ అరుణ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ లేకున్నా భారత్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
    Published by:Sridhar Reddy
    First published: