ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 242వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ సాధించి సచిన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. అయితే ఇదే మ్యాచ్‌లో కోహ్లి తన వన్డే కెరీర్లో ఓ చెత్త రికార్డును కూడా నమోదు చేశాడు. ఒక్క సెంచరీ కూడా చేయకుండానే ఈ ఏడాదిని ముగించాడు. అయితే, గత మూడేళ్లుగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ రన్‌మెషీన్.. వన్డేల్లో ఇప్పటి వరకు మొత్తంగా 43 సెంచరీలు చేశాడు. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లి 2009 డిసెంబరులో ఈడెన్‌గార్డెన్స్ మైదానంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత ప్రతీ ఏటా కనీసంగా ఒక్క సెంచరీ అయిన తన పేరిట లిఖించుకున్నాడు.
ఇక కరోనా ఎఫెక్ట్ తో 2020లో కేవలం 9 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి ఒక్క మ్యాచ్‌లోనూ వంద పరుగుల మార్కును చేరుకోలేకపోయాడు. దీంతో ఆసీస్‌తో జరిగిన చివరి వన్డేలో అరుదైన ఘనతతో పాటు చెత్త రికార్డును నమోదు చేశాడు.
అలాగే, ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కూడా కోహ్లీ నిరాశపరిచాడు. ఒకటి రెండు మినహా తప్పించి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అదే విధంగా కెప్టెన్సీలో కూడా ఫెయిలయ్యాడు. ఆర్సీబీకి టైటిల్ అందించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. 13 సీజన్లు జరిగినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. ఐపీఎల్ టైటిల్ సాధించకపోవడంతో కోహ్లీపై మాజీ క్రికెటర్లు విమర్శ బాణాలు సంధిస్తున్నారు. కెప్టెన్ గా కోహ్లీ పనికి రాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

Virat Kohli
అయితే, ఆసీస్‌తో మూడో వన్డేలో టాస్ గెలిచిన కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌ను అబాట్, అగర్లు పెవిలియన్‌కు చేర్చగా.. ఆడం జంపా శ్రేయస్ అయ్యర్‌ను అవుట్ చేశాడు. ఇక వచ్చీరాగానే కేఎల్ రాహుల్‌ను ఎల్బీడబ్ల్యూగా అగర్ వెనక్కి పంపగా, నిలకడగా ఆడుతున్న కెప్టెన్ కోహ్లిని హాజిల్‌వుడ్ అవుట్ చేశాడు. దీంతో 152 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఆల్‌రౌండర్లు పాండ్యా, జడేజా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ కలిసి 108 బంతుల్లో 159 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ పార్టనర్ షిప్ తో 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది.
అయితే, వృతి పరంగా కోహ్లీకి ఈ ఏడాది కలసిరాకపోయినా వ్యక్తిగతంగా కలిసొచ్చింది. విరాట్ భార్య అనుష్య శర్మ ఈ ఏడాదిలోనే ప్రెగ్నెంట్ అయింది. ఇది కోహ్లీకి నిజంగానే శుభవార్త.