Home /News /sports /

VIRAT KOHLI EVERYTHING IS KNOWN DOUBTS OVER BCCI S ATTITUDE TOWARDS KOHLI DEPARTURE EVK

Virat Kohli: అంతా తెలిసే జ‌రిగిందా.. కోహ్లీ వైద‌ల‌గ‌డంపై బీసీసీఐ తీరుపై అనుమానాలు!

విరాట్ కొహ్లి

విరాట్ కొహ్లి

Virat Kohli | టీమిండియా టెస్ట్‌ సారధి విరాట్‌ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్‌ సారధ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్‌ వేదికగా శనివారం ప్రకటించాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ తిన్నారు. విరాట్ కోహ్లీ వైదొల‌గ‌డంపై బోర్దు వ్య‌వ‌హార శైలి కార‌ణమ‌ని ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

    టీమిండియా (Team India) టెస్ట్‌ సారధి విరాట్‌ కోహ్లి (Virat Kohli) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్‌ సారధ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్‌ (Twitter) వేదికగా శనివారం ప్రకటించాడు. ఈ సందర్భంగా 7 ఏళ్ల కెప్టెన్సీ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్‌గా అవకాశం ఇచ్చిన బీసీసీఐ (BCCI)కి సైతం థ్యాంక్స్‌ చెప్పాడు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించాడు. దీంతో టీం ఇండియా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గుర‌య్యాడు. అయితే కోహ్లీ సంచ‌ల‌న నిర్ణ‌యం వెనుక బీసీసీఐ కార‌ణం అని ప‌లువురు ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బీసీసీఐ ఇటీవ‌ల వ్య‌వ‌హ‌రించిన తీరే కోహ్లీ కెప్టెన్సీ వైదొల‌గ‌డానికి కార‌ణం అనే అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది. కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొల‌గ‌డానికి కార‌ణం.. బీసీసీఐ అంటూ సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మంచి ఆట‌గాడిని ఎలా చూసుకోవాలో తెలిదంటూ కామెంట్లు.. MEMEలు షేర్ చేస్తున్నారు.


    IPL: ఐపీఎల్‌లో సూప‌ర్ హిట్‌.. త‌రువాత మాయ‌మై ఎక్క‌డికి పోయారు ఈ క్రికెట‌ర్లు!




    బీసీసీఐ ట్వీట్‌..
    బీసీసీఐ కోహ్లీ చేసిన ప్ర‌క‌ట‌న‌పై స్పందించిన తీరు ఫ్యాన్స్‌కు అనుమానాల‌కు తావిస్తోంది. కోహ్లీ అనూహ్య నిర్ణ‌యంపై ఎటువంటి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌కుండా కేవ‌లం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించింది. కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు ఎన్నో మైలురాళ్లను అధిగమించడమే కాకుండా, అత్యున్నత స్థాయికి వెళ్లిందని పేర్కొంది. టెస్టుల్లో భారత్‌ తరఫున 68 మ్యాచ్‌లకు కోహ్లి నేతృత్వం వహించగా 40 విజయాలను సాధించింద‌ని పేర్కొంటు ట్వీట్ చేసింది.



    కోహ్లీ కెప్టెన్సీ నిర్ణ‌యంపై బీసీసీఐ సెక్ర‌ట‌రీ జై షా ట్వీట్ చేశారు. ‘టీమిండియా కెప్టెన్‌గా జట్టును ఉన్నతస్థాయికి తీసుకెళ్లావు. స్వదేశంలోనూ , విదేశాల్లోనూ నీ కెప్టెన్సీలో భారత జట్టు బలమైన శక్తిగా ఎదిగింది. ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో నీ సారథ్యంలో సాధించిన విజయాలు ప్రత్యేకం. ఎప్పటికీ మరువలేనివి’ అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు.

    Samantha Ruth Prabhu: జిమ్‌లో స‌మంతా.. వ‌ర్క్ఔట్ మాములుగా లేదుగా!



    Kangana Ranaut: కంగానా ర‌నౌత్ చెంప‌ల‌పై.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు

    ఏది ఏమైనా టీం ఇండియాకు ఎన్నో అపూర్వ విజ‌యాలు సాధించిన విరాట్ కోహ్లీకి స‌రైన వీడ్కోలు ఇవ్వ‌డంలో బీసీసీఐ విఫ‌లం అయ్యింద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. బీసీసీఐ వ్య‌వ‌హార శైలి కోహ్లీ నిర్ణ‌యానికి కార‌ణం అన్నారు. గతంలోనూ వన్‌డే, టీ20 కెప్టెన్సీ తొల‌గింపు స‌మ‌యంలో త‌న‌కు గంట ముందు మాత్రమే తొల‌గించార‌ని విరాట్ పేర్కొన‌డంతో బీసీసీఐకీ, కోహ్లీకి మ‌ధ్య గ్యాప్ ఉంద‌నే అనుమానం క్రికెట్ ఫ్యాన్స్‌కి వ‌చ్చింది. తాజాగా కోహ్లీ సంచ‌ల నిర్ణ‌యంతో క్రికెట్ ఫ్యాన్స్ మ‌రింత అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Bcci, Test Cricket, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు