ముంబై వాంఖడే స్టేడియం (Wankhade Stadium) వేదికగా ఇండియా - న్యూజీలాండ్ (India Vs New Zealand) మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు (Team India) బ్యాటింగ్‌లో పూర్తిగా తడబడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal), శుభ్‌మన్ గిల్ (Shubhman gil) (44) సరైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలసి కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నారు. ఇద్దరూ కలసి 80 పరుగులు చేసి భారత జట్టును పటిష్టంగా నిలిపారు. కానీ అజాజ్ పటేల్ రెండు ఓవర్ల్ వ్యవధిలో మూడు కీలక వికెట్లు తీసి భారత జట్టుు దెబ్బతీశాడు. తొలుత శుభ్‌మన్ గిల్ వికెట్ పడగొట్టిన అజాజ్.. ఆ తర్వాత చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీని (Virat Kohli) డకౌట్ (Duck Out) చేశాడు. పుజార క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే విరాట్ కోహ్లీ వివాదాస్పద రీతిలో అవుటయ్యాడు. అజాజ్ వేసిన బాల్ కోహ్లీ ప్యాడ్‌కు తగిలిందని భావించి అప్పీల్ చేయగా ఆన్ ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే కోహ్లీ రివ్యూ కోరగా.. రిప్లైలో ఎన్ని సార్లు చూసినా థర్డ్ అంపైర్ ఒక కొలిక్కి రాలేకపోయాడు. చివరకు అనుమానంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని కొనసాగించారు. దీంతో కెప్టెన్ కోహ్లీ తనకు కలసి వచ్చిన వాంఖడే స్టేడియంలో డకౌట్ రూపంలో వెనుదిరిగాడు.
విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో డకౌట్ అవడం ద్వారా చాలా చెత్త రికార్డులు నమోదు చేసుకున్నాడు. కెప్టెన్‌గా టెస్టుల్లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా రెండో స్థానంలో నిలిచాడు. న్యూజీలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ 13 డకౌట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 10 డకౌట్లతో రెండో స్థానంలో ఉండగా.. తాజాగా విరాట్ కోహ్లీ ఆ చెత్త రికార్డును సమం చేశాడు. ఇక అత్యధిక డకౌట్లు అయిన కెప్టెన్లలో మూడో స్థానంలో ఇంగ్లాండ్ కెప్టెన్ మైక్ అథర్టన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హన్సీ క్రోన్యే, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉన్నారు. వీళ్లు ముగ్గురూ 8 సార్లు డకౌట్‌గా వెనుదిరిగారు.
ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సంయుక్త రికార్డు నమోదు చేశాడు. 1976లో బిషన్ సింగ్ బేడీ, 1983లో కపిల్ దేవ్, 2011లో ఎంఎస్ ధోనీ ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు సార్లు టెస్టుల్లో డకౌట్ అయ్యారు. తాజాగా విరాట్ కోహ్లీ ముంబై టెస్టులో డకౌట్ అయ్యి.. వారి సరసన నిలిచాడు. మరోవైపు నెంబర్ 4లో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక డకౌట్లు నమోదు చేసిన టీమ్ ఇండియా బ్యాటర్‌గా విరాట్ చెత్త రికార్డు నమోదు చేశాడు. గతంలో సచిన్ టెండుల్కర్ నెంబర్ 4లో బ్యాటింగ్‌కు దిగి 10 సార్లు డకౌట్ అయ్యాడు. తాజాగా విరాట్ ఆ సంఖ్యను అధిగమించి 11 డకౌట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. గత రెండేళ్లుగా సెంచరీ నమోదు చేయని విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో రాణించి ఫ్యాన్స్ దాహాన్ని తీరుస్తాడని భావిస్తే.. డకౌట్ రూపంలో అవుటవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kapil Dev, MS Dhoni, Team India, Test Cricket, Virat kohli