Home /News /sports /

VIRAT KOHLI DISMISSES SOURAV GANGULY STATEMENT SAYS NOBODY ASKED ME NOT TO QUIT T20 CAPTAINCY JNK

Virat Kohli: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై పెద్ద బాంబు పేల్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అలాంటిదేమీ జరగలేదు..!

కెప్టెన్సీ వదిలేయవద్దని నన్నెవరూ బుజ్జగించలేదు (PC: BCCI)

కెప్టెన్సీ వదిలేయవద్దని నన్నెవరూ బుజ్జగించలేదు (PC: BCCI)

Virat Kohli: టీ20 కెప్టెన్సీ వదిలేసిన తర్వాత బీసీసీఐ నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదని, కెప్టెన్సీ విషయంలో పునరాలోచించుకోమని కూడా ఎవరూ చెప్పలేదని టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. సౌరవ్ గంగూలీ తనను బతిమిలాడినట్లు చేసిన వ్యాఖ్యలను కోహ్లీ ఖండించాడు.

ఇంకా చదవండి ...
    టీమ్ ఇండియాలో (Team India) నెలకొన్న సంక్షోభానికి టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తెర దించాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు (South Africa Tour) ముందు ముంబై నుంచి వర్చువల్ విలేకరుల సమావేశంలో పాల్గొన కోహ్లీ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. వన్డేలకు తాను అందుబాటులోనే ఉంటానని.. తానెప్పుడూ సెలవు తీసుకుంటానని చెప్పలేదని స్పష్టం చేశాడు. అయితే ఈ విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ నేరుగా గంగూలీ (Sourav Ganguly) వ్యాఖ్యలను ఖండించడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. టీ20 వరల్డ్ కప్ కంటే ముందే విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ కెప్టెన్సీని వదిలేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో సెలెక్టర్లు ఆయనను డిసెంబర్ 8న వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. అప్పటి నుంచి కోహ్లీ అందుబాటులో లేకుండా పోయాడు. అదే సమయంలో పలు ఊహాగానాలు బయట చక్కర్లు కొట్టాయి.

    కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదిలేస్తానని చెప్పినప్పుడే తాను మాట్లాడానని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పాడు. పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ వదిలేయవద్దని తాను చెప్పానని కూడా గంగూలీ అన్నాడు. అయినా సరే కోహ్లీ వినలేదని.. కెప్టెన్సీని వదిలేయడానికే సిద్దపడ్డాడని చెప్పాడు. తాజాగా విరాట్ కోహ్లీ ఈ వ్యాఖ్యలను ఖండించాడు. 'నేను టీ20 కెప్టెన్సీని వదిలేస్తానని చెప్పగానే బీసీసీఐ నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. నన్ను ఎవరూ నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పలేదు. పైగా నేను కెప్టెన్సీ వదిలేయడాన్ని వాళ్లు సానుకూలంగా తీసుకున్నారు. సరైన నిర్ణయమా అన్నట్లుగా వారు భావించారు' అని చెప్పాడు. ఇన్ని రోజులు మీడియాతో గంగూలీ చెప్పిన మాటలను కోహ్లీ ఖండించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.

    IND vs SA: సెలవు లేదు ఏమి లేదు.. వన్డే సిరీస్‌కు అందుబాటులోనే ఉంటాను.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ




    మరోవైపు టీ20 కెప్టెన్సీని వదిలేస్తానని ప్రకటించిన రోజు నుంచి డిసెంబర్ 8 వరకు బీసీసీఐ నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని కోహ్లీ చెప్పాడు. డిసెంబర్ 8న దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే టెస్టు జట్టు సెలెక్షన్‌లో తాను పాల్గొన్నానని.. ఆ సమయంలో ఆటగాళ్ల ఎంపిక సవ్యంగానే సాగిందని కోహ్లీ అన్నాడు. జట్టు కూర్పును పూర్తి చేశాక సెలెక్టర్లు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని కోహ్లీ అన్నాడు. అయితే టెస్టు జట్టు ఎంపికకు సరిగ్గా గంటన్నర ముందు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఫోన్ చేసి.. మిగతా సెలెక్టర్ల అభిప్రాయం మేరకు వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నాము అని చెప్పారు. దానికి నేను 'సరే.. పర్వాలేదు' అని సమాధానం ఇచ్చానని కోహ్లీ చెప్పాడు. అయితే టెస్టు జట్టును సెలెక్ట్ చేసిన తర్వాత నేను వారితో మాట్లాడలేదని కోహ్లీ అన్నాడు.

    CWC 2022 Schedule: క్రికెట్ వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ.. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో టీమ్ ఇండియా ఢీ




    తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఎలాంటి ఇబ్బంది లేదని కోహ్లీ చెప్పాడు. అయితే సక్రమమైన పద్దతిలో మాత్రం ఇది జరగలేదని మాత్రం అన్నాడు. టీ20 వరల్డ్ కప్‌కు ముందే పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీని వదిలేశాను. అప్పటి నుంచి డిసెంబర్ 8 వరకు చాలా సమయం గడిచింది. కానీ బీసీసీఐ నుంచి నాకు ఎలాంటి కాల్స్ రాలేదు. కేవలం గంటన్నర ముందు వారి నిర్ణయం తెలిపారు. ఇది కొంచెం సక్రమంగా జరిగి ఉంటే బాగుండేదని కోహ్లీ అన్నాడు. సెలెక్టర్లు, బీసీసీఐ ఆఫీస్ బేరర్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: Bcci, Cricket, Sourav Ganguly, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు