హోమ్ /వార్తలు /sports /

IND vs SA: సెలవు లేదు ఏమి లేదు.. వన్డే సిరీస్‌కు అందుబాటులోనే ఉంటాను.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

IND vs SA: సెలవు లేదు ఏమి లేదు.. వన్డే సిరీస్‌కు అందుబాటులోనే ఉంటాను.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

IND vs SA: గత వారం రోజులుగా టీమ్ ఇండియాలో నెలకొన్న సంక్షోభానికి విరాట్ కోహ్లీ తెరదించాడు. తాను దక్షిణాప్రికాతో వన్డే సిరీస్‌కు అందుబాటులోనే ఉంటానని తేల్చి చెప్పాడు. తాను వన్డే సిరీస్ ఆడబోవడం లేదని వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలే అని చెప్పాడు.

ఇంకా చదవండి ...

    టీమ్ ఇండియా (Team India) టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వారం రోజుల మౌనాన్ని వీడాడు. భారత జట్టు త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు (South Africa Tour) వెళ్లనున్న నేపథ్యంలో తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. గత కొన్ని రోజులుగా భారత క్రికెట్‌లో ఉన్న కెప్టెన్సీ (Captaincy) సంక్షోభానికి కోహ్లీ తెరదించాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడటానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. వన్డే సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే సమయానికి తాను సెలెక్టర్లకు అందుబాటులో ఉంటానని తేల్చి చెప్పాడు. వన్డేలకు అందుబాటులో ఉండనని తాను చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అదంతా ఊహాగానాలే తప్ప నిజం కాదు. తాను వన్డే సెలెక్షన్ కోసం అందుబాటులోనే ఉంటానని కోహ్లీ స్పష్టం చేశాడు. అసలు ఇలాంటి వార్తలు ఎవరు రాశారో వాళ్లనే వెళ్లి అడగమని ఒకానొక దశలో విరాట్ అసహనం వ్యక్తం చేశాడు.

    టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ లేకపోవడం పెద్ద నష్టమే అని విరాట్ కోహ్లీ అన్నాడు. ఇంగ్లాండ్‌లో రోహిత్ చక్కగా బ్యాటింగ్ చేశాడు.. జట్టు విజయాల్లో అతడి పాత్ర చాలా కీలకంగా ఉన్నది. అయితే ఇప్పుడు రోహిత్ లేకపోవడంతో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌పై పెద్ద బాధ్యత ఉన్నది. వాళ్లు తప్పకుండా రాణిస్తారని విరాట్ చెప్పాడు. దక్షిణాఫ్రికాలో మేము ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడబోవడం లేదు. వెళ్లిన తర్వాత అక్కడే క్వారంటైన్‌లో ఉంటాము. అయితే మ్యాచ్ సిమ్యులేషన్స్, నెట్ ప్రాక్టీస్ ద్వారా టెస్టుకు సిద్దపడతామని కోహ్లీ చెప్పాడు. సౌతాఫ్రికా గడ్డపై ముందు బ్యాటింగ్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్. అక్కడ బంతి వేగంగా రావడమే కాకుండా బౌన్స్ అవుతుంది. ఆ బంతులను ఎదుర్కోవడానికి చాలా ఓపిక ఉండాలని కోహ్లీ అన్నాడు. మేం టెస్టు సిరీస్ కోసం పూర్తి సన్నద్దతతోనే ఉన్నాము. ఇటీవలే టెస్టు సిరీస్ ముగించాము. అందరూ మంచి టచ్‌లోనే ఉన్నారని కోహ్లీ చెప్పాడు.

    CWC 2022 Schedule: క్రికెట్ వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ.. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో టీమ్ ఇండియా ఢీ

    మేము ఇంత వరకు సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవలేదు. ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లు గెలిచాము. ఇక ఇప్పుడు దక్షిణ ఆఫ్రికాలో మేము మరింత మంచిగా రాణించాల్సి ఉన్నది. జట్టు మంచి ఫామ్‌లో ఉన్నది. మేము గతంలోనే సౌతాఫ్రికాలో మ్యాచ్‌లు గెలవాల్సింది. కానీ ఇప్పటికైనా ఆలస్యం ఏమీ లేదు. అక్కడ కూడా సిరీస్ గెలిచి తీరతామని అన్నాడు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    First published:

    ఉత్తమ కథలు