నన్ను విమర్శించడం మానేసి పండగ చేస్కోండి - విరాట్ కోహ్లీ...

‘దేశం విడిచివెళ్లు’ కామెంట్లను సమర్థించుకున్న విరాట్ కోహ్లీ... ట్రోలింగ్ నాకు కొత్త కాదు... నాకు ఆ స్వేచ్ఛ ఉంది.... ట్విట్టర్లో తనపై వస్తున్న విమర్శలకు రిప్లై ఇచ్చిన భారత సారథి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 8, 2018, 7:49 PM IST
నన్ను విమర్శించడం మానేసి పండగ చేస్కోండి - విరాట్ కోహ్లీ...
భార్య అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ (పాత ఫోటో)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 8, 2018, 7:49 PM IST
తనపై, భారత క్రికెటర్లపై విమర్శలు చేసిన పాక్ జాతీయుడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ... ‘దేశం విడిచివెళ్లు’ అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ‘భారతీయ క్రికెటర్లను ఇష్టపడకపోతే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలా...’ అంటూ చాలామంది నెటిజన్స్ కోహ్లీని ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉన్న హీరో సిద్ధార్థలాంటి వాళ్లు కూడా విరాట్ కోహ్లీ ఇలా మాట్లాడకూడదంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడం మొదలెట్టారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కి కూల్‌గా రిప్లై ఇచ్చాడు విరాట్.

నా మీద ట్రోలింగ్ రావడం ఇది మొదటిసారి కాదు. మొదటి నుంచి నేను ట్రోలింగ్ చేయబడుతూనే ఉన్నాను. నేను ‘దీజ్ ఇండియన్స్’ అని నాపై, భారత క్రికెటర్లపై కామెంట్ చేసిన వ్యక్తిని మాత్రమే అన్నాను. నాకు ఆ స్వేచ్ఛ ఉంది. లైట్ తీస్కోండి... నన్ను విమర్శించడం మానేసి పండగ చేస్తోంది. అందరికీ ప్రేమా, శాంతి కలగాలని కోరుకుంటున్నా...
విరాట్ కోహ్లీ, భారత క్రికెట్ సారథి


మూడు రోజుల క్రితం 30వ ఒడిలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ... తన పుట్టినరోజున పంపిన శుభాకాంక్షల ట్వీట్లను చదువుతూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో ఓ నెటిజన్... ‘విరాట్ కోహ్లీ ఓవర్ రేటెడ్ బ్యాట్స్‌మెన్. నాకు అతని బ్యాటింగ్‌లో పెద్దగా ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. నీలాంటి భారత క్రికెటర్ల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్ బ్యాట్స్‌మెన్లు ఆడే ఆటే నాకెంతో బాగా నచ్చుతుంది...’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి విరాట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వీడియో ట్వీట్ చేశాడు... ‘నా ఆటతీరు నచ్చకపోతే అది నీ పర్సనల్ విషయం. దాని గురించి నేనేమీ మాట్లాడను. కానీ భారత దేశంలో ఉంటూ వేరే దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావ్. నా దేశాన్ని ఇష్టపడని నీకు ఇక్కడుంటే అర్హత లేదు. దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లిపోతే బాగుంటుంది... ’ అంటూ గట్టిగా సమాధానం చెబుతూ వీడియో పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ కామెంట్లపై సర్వతా విమర్శలు వెల్లువెత్తాయి.

విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్...

First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...