రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లి..

విండీస్‌తో రెండో టెస్టులో 19 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు.

news18-telugu
Updated: December 8, 2019, 10:02 PM IST
రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లి..
విరాట్ కోహ్లి
  • Share this:
విండీస్‌తో రెండో టెస్టులో 19 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు(2563) చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. టీ20ల్లో ప్రస్తుతం రోహిత్ శర్మ పరుగులు 2562. ఇద్దరి మధ్య కేవలం ఒక్క పరుగు మాత్రమే తేడా ఉంది. కాబట్టి తదుపరి మ్యాచ్‌లలో వీరు సాధించే స్కోర్లను బట్టి.. అత్యధిక పరుగుల రికార్డు ఎవరి వద్ద ఎక్కువ రోజులు ఉంటుందనేది తేలుతుంది. అత్యధిక పరుగుల జాబితాలో వీరిద్దరి తర్వాత మార్టిన్‌ గప్టిల్‌(2463, న్యూజిలాండ్‌), షోయాబ్‌ మాలిక్‌(2263 పాకిస్తాన్‌) ఉన్నారు.

కాగా, విండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20ఓవర్లలో170/7 పరుగులు చేసింది.భారత బ్యాటింగ్‌లో కేవలం శివం దూబే(54),రిషబ్ పంత్(33) మాత్రమే రాణించారు. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి 99/1తో విండీస్ పటిష్ట స్థితిలో ఉంది.First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>