కెప్టెన్‌గా ధోనీ రికార్డును బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ

Ind vs Aus 3rd ODI | అతి తక్కువ వన్డేల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న కెప్టెన్‌గా ధోనీ పేరిట ఉన్న రికార్డుని విరాట్ కోహ్లీ తన పేరిట తిరగరాసుకున్నాడు.

news18-telugu
Updated: January 19, 2020, 8:56 PM IST
కెప్టెన్‌గా ధోనీ రికార్డును బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ
బెంగళూరు వన్డేలో శతకం సాధించిన రోహిత్ శర్మను అభినందిస్తున్న కోహ్లీ (image: BCCI)
  • Share this:
వన్డే క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బెంగళూరులో ఆసీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో...కెప్టెన్‌గా అతి తక్కువ వన్డే ఇన్నింగ్స్‌లో 5000 పరుగుల మైలురాయిని దాటిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సాధించాడు. టీమిండియా కెప్టెన్‌గా కేవలం 82 ఇన్నింగ్స్‌లో కోహ్లీ 5000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఎంఎస్ ధోనీ 127 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించగా...ఇప్పుడు ధోనీ రికార్డుని కోహ్లీ తన పేరిట తిరగరాసుకున్నాడు. విరాట్ కోహ్లీ, ధోనీల తర్వాత రికీ పాంటింగ్(131 ఇన్నింగ్స్), గ్రీమ్ స్మిత్(135 ఇన్నింగ్స్), సౌరవ్ గంగూలీ(136 ఇన్నింగ్స్) అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న కెప్టెన్లుగా ఉన్నారు.అంతర్జాతీయ క్రికెట్‌(వన్డే, టెస్ట్, టీ20) లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 11 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న కెప్టెన్‌గానూ ఆసీస్‌తో రెండో వన్డేలో కోహ్లీ ఘనత సాధించడం తెలిసిందే. కేవలం 169 ఇన్నింగ్స్ ‌లో కోహ్లీ ఈ ఘనతను సాధించి ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ని వెనక్కినెట్టాడు.
Published by: Janardhan V
First published: January 19, 2020, 8:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading