విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు..దేశంలో నెంబర్.1..

Virat Kohli Records | ఇన్‌స్టాగ్రమ్‌లో 50 మిల్లియన్ ఫాలోవర్లతో దేశంలో ఈ ఘనతను సాధించిన తొలి వ్యక్తిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.

news18-telugu
Updated: February 18, 2020, 9:07 AM IST
విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు..దేశంలో నెంబర్.1..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(ఫైల్ ఫోటో)
  • Share this:
టీమిండియా కెప్టెన్, పరుగులు యంత్రం విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. అయితే ఈ రికార్డు మాత్రం మైదానానికి బయట నమోదయ్యింది. ఇన్‌స్టాగ్రమ్‌లో 50 మిల్లియన్ ఫాలోవర్స్ మైలురాయిని అధిగమించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు కోహ్లీ. క్రికెట్‌లో పలు అంతర్జాతీయ రికార్డులను తిరగరాస్తున్న కోహ్లీకి సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండేందుకు కోహ్లీ తరచూ సోషల్ మీడియాలోని తన ఖాతాల్లో పోస్టింగ్స్ చేస్తుంటాడు. 31 ఏళ్ల కోహ్లీ ఇప్పటి వరకు ఇన్‌స్టాలో 930 పోస్టులు చేశాడు. ఇన్‌స్టాలో పోస్టింగ్స్ ద్వారా ప్రతియేటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు కోహ్లీ.

ఇన్‌స్టాలో 49.9 మిల్లియన్ల ఫాలోవర్లతో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దేశంలో రెండో స్థానంలో కొనసాగుతోంది. 44.1 మిల్లియన్ ఫాలోవర్లతో మరో బాలీవుడ్ నటి దీపిక పదుకొనె మూడో స్థానంలో ఉంది.

ఇన్‌స్టాలో 200 మిల్లియన్ ఫాలోవర్లతో పోర్చుగల్ సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డ్ ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఆటగాడుగా కొనసాగుతున్నాడు.

ఇది కూడా చదవండిCristiano Ronaldo: సరిలేరు నీకెవ్వరు..సాకర్ దిగ్గజం సరికొత్త రికార్డు
First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు