• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • VIRAT KOHLI BECAME THE FIRST INDIAN TO CROSS 100 MILLION FOLLOWERS ON INSTAGRAM AND TEAM INDIA CAPTAIN THANKED HIS FANS FOR THE MILESTONE SRD

Virat Kohli : పది కోట్ల ఫాలోవర్లు..ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదే...

Virat Kohli : పది కోట్ల ఫాలోవర్లు..ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదే...

విరాట్ కొహ్లీ

Virat Kohli : విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. ఫార్మాట్ ఏదైనా మైదానంలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. తాజాగా అతని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య 100 మిలియన్‌కి చేరింది. భారత్‌ తరఫున ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘనత సాధించిన తొలి సెలెబ్రిటీ విరాట్ కోహ్లీనే కావడం విశేషం.

  • Share this:
    విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. ఫార్మాట్ ఏదైనా మైదానంలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఇప్పటికే క‌్రికెట్ అన్ని ఫార్మాట్ల‌లో ఎన్నో రికార్డులు తన పేరుపై లిఖించుకున్నాడు. దిగ్గజాలకు కూడా సాధ్యంకాని రికార్డులు కొల్లగొట్టాడు.ఫార్మాట్ ఏదైనా మైదానంలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఇప్పటికే క‌్రికెట్ అన్ని ఫార్మాట్ల‌లో ఎన్నో రికార్డులు తన పేరుపై లిఖించుకున్నాడు. దిగ్గజాలకు కూడా సాధ్యంకాని రికార్డులు కొల్లగొట్టాడు.మైదానంలో రికార్డుల మోత మోగించే విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలోనూ తనకి తిరుగులేదని నిరూపించాడు. తాజాగా అతని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య 100 మిలియన్‌కి చేరింది. భారత్‌ తరఫున ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘనత సాధించిన తొలి సెలెబ్రిటీ విరాట్ కోహ్లీనే కావడం విశేషం. పది కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ..ఈ మైల్ స్టోన్ పై స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారానే త‌న ఫాలోవ‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు. మీ వ‌ల్లే ఈ జ‌ర్నీ బ్యూటీఫుల్‌గా మారింది. మీరు కురిపించిన ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలంటూ కోహ్లి కామెంట్ చేశాడు.

    ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌ది కోట్ల మంది ఫాలోవ‌ర్లను సంపాదించిన ఫస్ట్ ఇండియ‌న్‌, ఫ‌స్ట్ ఏషియ‌న్‌, ఫ‌స్ట్ క్రికెట‌ర్‌తోపాటు ప్ర‌పంచవ్యాప్తంగా నాలుగో అథ్లెట్‌గా నిలిచాడు. కోహ్లి కంటే ముందు ఫుట్‌బాల‌ర్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, నెయ్‌మార్ ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ల ద్వారా అత్య‌ధికంగా సంపాదిస్తున్న టాప్ టెన్ స్పోర్ట్స్ ప‌ర్స‌న్ల‌లో ఉన్న ఏకైక క్రికెట‌ర్ కూడా కోహ్లినే కావడం విశేషం. ప్ర‌పంచంలో 26.5 కోట్ల మంది ఫాలోవ‌ర్ల‌తో అత్య‌ధిక మంది ఫాలోవ‌ర్లు ఉన్న స్పోర్ట్స్ ప‌ర్స‌న్‌గా క్రిస్టియానో రొనాల్డో నిలిచాడు.








    View this post on Instagram






    A post shared by Virat Kohli (@virat.kohli)





    మరోవైపు, రేపటి నుంచి ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై దుమ్మురేపుతున్న భారత్ చివరి టెస్టు కోసం సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేస్తోంది. ఈ మ్యాచ్ లో పలు రికార్డులపై విరాట్ కోహ్లీ కన్నేశాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు