Home /News /sports /

VIRAT KOHLI BCCI RIFT WHAT IS GOING ON BETWEEN BCCI AND VIRAT WHAT FORMER CRICKETERS SUGGESTING JNK

Virat Kohli: కోహ్లీ వ్యవహారంలో బీసీసీఐ ఏం చేయబోతున్నది? మాజీ క్రికెటర్లు ఏమంటున్నారు?

మరింతగా ముదిరిన కోహ్లీ-బీసీసీఐ వ్యవహారం

మరింతగా ముదిరిన కోహ్లీ-బీసీసీఐ వ్యవహారం

Virat Kohli: విరాట్ కోహ్లీ వ్యవహారం మరింతగా ముదిరిపోయింది. టెస్టు కెప్టెన్, క్రికెట్ బోర్డు మధ్య మరింతగా చెడిపోయింది. విలేకరుల సమావేశంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు బోర్డుకు ఆగ్రహం తెప్పించాయి. దీనిపై బీసీసీఐ ఏం చేయబోతున్నది.

    టీమ్ ఇండియా (Team India) వన్డే కెప్టెన్సీ (Captaincy) వ్యవహారంలో నిన్నటి వరకు కోహ్లీ (Virat Kohli) వర్సెస్ రోహిత్‌గా (Rohit Sharma) ఉన్న వ్యవహారం కాస్తా ఇప్పుడు కోహ్లీ వర్సెస్ బీసీసీఐగా (BCCI) మారిపోయింది. కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై బోర్డును తప్పుబట్టిన మాజీ క్రికెటర్లు ఇప్పుడు అతడికి వ్యతిరేకంగా మారిపోయారు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ముంబైలో విలేకరులతో మాట్లాడిన విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అతడి మెడకు చుట్టుకుంటున్నాయి. బీసీసీఐ, సౌరవ్ గంగూలీకి వ్యతిరేకంగా మాట్లాడటంపై బోర్డు పెద్దలు గుర్రుగా ఉన్నారు. టీమ్ ఇండియాకు కెప్టెన్ అయి ఉండి ఇలా పరిణితి లేకుండా బహిరంగంగా లుకలుకలు బయటపెట్టడంపై కోహ్లీపై చర్యలు తీసుకునేందకు బోర్డు సిద్దపడుతున్నది. విరాట్ కోహ్లీ ఇప్పటికే జట్టుతో పాటు దక్షిణాఫ్రికా వెళ్లిపోయాడు. అయితే ప్రెస్ మీట్‌లో బీసీసీఐ తనతో సరిగా వ్యవహరించలేదని.. కేవలం గంటన్నర ముందు మాత్రమే తన వన్డే కెప్టెన్సీ తీసేస్తున్నట్లు చెప్పారని కోహ్లీ వెల్లడించాడు. బోర్డు పరిధిలోనే ఉండాల్సిన విషయాలను ఎందుకు బయటకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోహ్లీకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తున్నది.

    కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదిలేస్తానని చెప్పినప్పుడే తాను స్వయంగా అతడితో మాట్లాడానని.. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కూడా సూచించినట్లు గంగూలీ గతంలోనే మీడియాకు చెప్పాడు. అయితే బుధవారం నాటి విలేకరుల సమావేశంలో కోహ్లీ ఈ వ్యాఖ్యలను ఖండించాడు. టీ20 కెప్టెన్సీని వదిలిపెట్ట వద్దని తనకు ఎవరూ చెప్పలేదన్నాడు. కోహ్లీ వ్యాఖ్యలపై తాజాగా గంగూలీ స్పందించాడు. ఈ వ్యాఖ్యలపై తాను మాట్లాడనని చెప్పాడు. 'బోర్డు ఈ వ్యవహారాన్ని సరైన సమయంలో డీల్ చేస్తుంది. ఈ విషయంపై ప్రకటనలు చేయడం, విలేకరు సమావేశాన్ని ఏర్పాటు చేయడం లాంటివి ఏమీ చేయం. ఇది పూర్తిగా బోర్డు అంతర్గత వ్యవహారం. దీన్ని బోర్డుకే వదిలేయండి' అని గంగూలీ చెప్పాడు. కోహ్లీ వ్యాఖ్యల తర్వాత సెలెక్టర్లు విలేకరుల సమావేశం పెట్టాలని భావించినప్పటికీ.. ఈ విషయం మరింత ముదరకుండా బీసీసీఐ వారిని ఆపినట్లు సమావేశం. ఇకపై బోర్డే నేరుగా కోహ్లీతో ఈ విషయంపై చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

    Suresh Raina: ‘సార్సోం కా సాగ్‌’ సురేష్ రైనా వింటర్ డిష్.. దీని స్పెషల్ ఏంటో తెలుసా..?




    కోహ్లీ వ్యవహారంపై మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. కీలకమైన విదేశీ పర్యటన ముందు ఇలాంటి వివాదాలు సరి కాదని అంటున్నారు. టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి బోర్డుకు విభేదాలు ఉన్నట్లు ప్రపంచమంతా తెలియడం మంచి విషయం కాదంటున్నారు. బీసీసీఐ బోర్డు అధ్యక్ష పదవి ఎంత గొప్పదో.. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం కూడా అంతే గొప్పది. అయితే బహిరంగంగా పరస్పరం వ్యాఖ్యలు చేసుకోవడం మంచి పద్దతి కాదని కపిల్ దేవ్ అన్నారు. కోహ్లీ అయినా గంగూలీ అయినా ఇకపై ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండటమే మంచిదని సూచించారు. మరో దిగ్గజ క్రికెటర్ సునిల్ గవాస్కర్ కోహ్లీకి మద్దతుగా ఉంటూనే చురకలంటించాడు.

    IPL 2022 Updates : SRH ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్టార్ బౌలర్ తో ఆరెంజ్ ఆర్మీ కీలక ఒప్పందం..


    బీసీసీఐ తనతో సరిగా వ్యవహరించలేదని అంటున్నాడు.. కానీ అంతకు ముందు కోహ్లీ చేసిన వ్యాఖ్యలు బోర్డుకు నచ్చకపోయి ఉండొచ్చని గవాస్కర్ అన్నాడు. టీ20 కెప్టెన్సీని వదిలేసే సమయంలో 'ఇకపై టెస్టులు, వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేస్తాను' అని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కోహ్లీ అలా కాకుండా టీ20 నుంచి తప్పుకుంటున్నాను కానీ టెస్టు, వన్డే జట్టుకు అందుబాటులో ఉంటానని పోస్టు పెట్టాల్సిందని సునిల్ గవాస్కర్ సూచించాడు. ఏదేమైనా కోహ్లీ-బీసీసీఐ మధ్య దూరం పెరిగినట్లే కనిపిస్తున్నది. దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత కోహ్లీ వ్యాఖ్యలపై తప్పకుండా వివరణ అడుగుతామని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మరి ఈ వివాదానికి తెర ఎప్పుడు పడుతుందో వేచి చూడాల్సిందే.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: Bcci, Cricket, Sourav Ganguly, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు