బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ..., క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా అతనే...

ఛతేశ్వర్ పూజారాకు బెస్ట్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్‌... రోహిత్ శర్మకు ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు... స్మృతి మందన్నకు ‘ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 14, 2019, 7:53 PM IST
బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ..., క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా అతనే...
విరాట్ కోహ్లీ
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 14, 2019, 7:53 PM IST
ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘోర పరాభావంతో ఢీలా పడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఊరటనిచ్చే విషయం ఇది. ప్రతిష్టాత్మక సంస్థ ‘సియట్’ ప్రతీ ఏటా ప్రకటించే క్రికెట్ అవార్డుల్లో ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకున్నాడు భారత సారథి ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లీ. ఇంటర్నేషనల్ బెస్ట్ క్రికెటర్‌గా, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా అవార్డు సొంతం చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు ఇంటర్నేషనల్ బెస్ట్ బౌలర్‌గా అవార్డు దక్కింది. టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారాకు బెస్ట్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్‌గా ఎంపిక కాగా, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. మహిళా క్రికెట్ వైస్ కెప్టెన్ స్మృతి మందన్నకు ‘ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కడం విశేషం. కొన్నిరోజుల కిందట ప్రకటించిన విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు కూడా విరాట్ కోహ్లీ, స్మృతి మందన్నలకే దక్కిన సంగతి తెలిసిందే.

భారత మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం మొయిందర్ అమర్‌నాథ్‌కు ‘సియట్ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన అమర్‌నాథ్... ‘గత ఏడాది భారత క్రికెట్ చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడే కాకుండా ప్రపంచస్థాయిలో మన క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. నాకు ఈ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు. గత నెలలో ప్రకటించిన విజ్డన్ అవార్డుల్లో విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ఇయర్‌-2019గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. కోహ్లీ ఖాతాలో వరుసగా మూడో ఏడాది ఈ అవార్డు చేయడం విశేషం. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందన్నకు కూడా విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ఇయర్‌గా ఎంపికయ్యింది.


First published: May 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...