హోమ్ /వార్తలు /క్రీడలు /

Virat Kohli : కరీనా, సైఫ్ ల కొడుకు తైమూర్ పాపులారిటీకి అప్పుడే దెబ్బ కొడుతున్న కోహ్లీ గారాల పట్టి

Virat Kohli : కరీనా, సైఫ్ ల కొడుకు తైమూర్ పాపులారిటీకి అప్పుడే దెబ్బ కొడుతున్న కోహ్లీ గారాల పట్టి

Photo From Twitter

Photo From Twitter

Virat Kohli : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు మధ్యాహ్నం తండ్రయ్యాడు. అనుష్క శర్మ పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే, విరాట్ కోహ్లీ, అనుష్కల ముద్దుల తనయకు అప్పుడే సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు మధ్యాహ్నం తండ్రయ్యాడు. అనుష్క శర్మ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే తెలిపాడు. ఈ సమయంలో దయ చేసి ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోహ్లీ ఫ్యాన్స్ ను కోరాడు. 'ఇవాళ మధ్యాహ్నం మాకు కూతురు పుట్టిందన్న విషయాన్ని మీతో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. అనుష్క, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు, మా జీవితంలో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సమయంలో మా ప్రైవసీని మీరంతా గౌరవిస్తారని ఆశిస్తూ.. ప్రేమతో మీ విరాట్'‌ అంటూ కోహ్లీ ఓ లేఖను ట్విటర్లో పోస్ట్‌ చేశాడు. అయితే, విరాట్ కోహ్లీ, అనుష్కల ముద్దుల తనయ అప్పుడే సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. ఎంతలా ఉంటే.. కరీనా, సైఫ్ అలీ ఖాన్ ల కొడుకు తైమూర్ కు పోటీ ఇచ్చేంతగా.

View this post on Instagram


A post shared by Virat Kohli (@virat.kohli)సెలబ్రిటీల బిడ్డల్లో కరీనా, సైఫ్ ల కుమారుడు తైమూర్ అలీ ఖాన్ కు ఉన్న క్రేజే వేరు. అతడు నడిచిన, తుమ్మినా, ఏడ్చినా, నవ్వినా ఇలా ప్రతి విషయంలో బాలీవుడ్ మీడియా, నెటిజన్లు తైమూర్ ను ఎత్తేసేవారు. అయితే, ఇప్పుడు కోహ్లీ, అనుష్కల ముద్దుల తనయ రావడంతో ఇప్పుడు ఫోకస్ మారింది. అప్పుడే సోషల్ మీడియా వేదికగా తైమూర్ మీమ్స్ తో పోస్ట్ లు తెగ హల్ చల్ చేస్తున్నాయ్.

విరాట్ కూతురు వచ్చింది.. నా పని అయిపోయింది అంటూ తైమూర్ అన్నట్లుగా పోస్ట్ లు పెట్టారు. అనుష్క, కోహ్లీల తనయ రాకతో తైమూర్ కు కష్టాలు మొదలయ్యాయ్.. ఇక ఆ పిల్లాడు దుకాణం సర్దుకోవాల్సిందే అంటూ మరికొందరూ ట్వీట్లు చేస్తున్నారు.

First published:

Tags: Anushka Sharma, Bollywood, Kareena Kapoor, Kohli, Saif Ali Khan, Twitter, Virat kohli