టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఏడేళ్ల బుడతడి షాక్..

విండీస్ టూర్‌లో ఉన్న విరాట్ కోహ్లి-అనుష్క జంట అక్కడ ఓ చోటుకు వెళ్లగా.. ఏడేళ్ల బుడతడు వారి వద్దకు వచ్చాడు.చేతిలో పెన్,పేపర్ ఉండటంతో.. కోహ్లి ఆటోగ్రాఫ్ అడుగుతాడేమోనని అంతా భావించారు. కానీ..

news18-telugu
Updated: September 3, 2019, 7:12 PM IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఏడేళ్ల బుడతడి షాక్..
విరాట్ కోహ్లీ(ఫైల్ ఫోటో)
  • Share this:
హఠాత్తుగా ఎవరైనా సెలబ్రిటీ ఎదురైతే ఏం చేస్తాం..? పరిగెత్తుకెళ్లి ఓ ఆటోగ్రాఫ్ అడుగుతాం. వీలైతే ఓ సెల్ఫీ దిగుతాం. కానీ ఓ ఏడేళ్ల బుడతడు మాత్రం.. సెలబ్రిటీకే తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆ సెలబ్రిటీ మరెవరో కాదు.. విరాట్ కోహ్లి. విండీస్ టూర్‌లో ఉన్న విరాట్ కోహ్లి-అనుష్క జంట అక్కడ ఓ చోటుకు వెళ్లగా.. ఏడేళ్ల బుడతడు వారి వద్దకు వచ్చాడు.చేతిలో పెన్,పేపర్ ఉండటంతో.. కోహ్లి ఆటోగ్రాఫ్ అడుగుతాడేమోనని అంతా భావించారు. కానీ ఆ బుడతడు మాత్రం తనే ఆటోగ్రాఫ్ చేసి కోహ్లికి ఇచ్చాడు. బుడతడి ఆటోగ్రాఫ్‌కి మురిసిపోయిన కోహ్లి.. 'నైస్' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.ఆ బుడతడి బంధువు ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. 'ఇండియా విండీస్ తొలి టెస్ట్ మ్యాచ్ కోసం జమైకా వెళ్లిన మా మేనల్లుడు..కోహ్లి,అనుష్కలను కలుసుకున్నాడు.వాళ్ల వద్దకు పరిగెత్తుకెళ్లి తనే కోహ్లికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.' అంటూ చెప్పుకొచ్చింది.

కాగా, మొత్తం 48 టెస్టులకు సారథ్యం వహించిన కోహ్లీ 28 టెస్టు విజయాలతో మాజీ సారథి ధోనీ రికార్డును అధిగమించాడు.ధోనీ 60 టెస్ట్ మ్యాచ్‌ల్లో టీమిండియాకు 27 విజయాలు అందించాడు. విండీస్‌తో జరిగిన రెండు టెస్టులను భారత్ గెలుచుకోవడంతో.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో 120 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది.First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...