VIRAT KOHLI ANUSHKA SHARMA INTRODUCE DAUGHTER VAMIKA WITH PHOTO SA
కూతురు ఫోటోను రివీల్ చేసిన అనుష్క శర్మ.. చిన్నారి పేరేంటో తెలుసా!
anushka kohli with daughter
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ తమ కుమార్తెతో ఉన్న మొదటి చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పాటు తమ కుమార్తె పేరును కూడా ప్రకటించారు. తమ చిన్నారికి 'వామికా' అని నామకరణం చేసినట్లు తెలిపారు
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ తమ కుమార్తెతో ఉన్న మొదటి చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పాటు తమ కుమార్తె పేరును కూడా ప్రకటించారు. తమ చిన్నారికి 'వామికా' అని నామకరణం చేసినట్లు తెలిపారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పేర్లు కలిసేలా 'వామికా' అని పేరు పెట్టారు. జనవరిలో మమ్-డాడ్స్గా మారిన విరాట్ అనుష్క.. ఇప్పటివరకు చిన్నారిని బయట ప్రపంచానికి చూపించలేదు. " ఆహ్లదకరమైన మా జీవితంలో వామికా రాకతో మరింత సంతోషంగా మారింది. ఆనందం, కన్నీళ్లు, ఆందోళన ఈ భావోద్వేగాలను పాటు చిన్నారి రాకతో మా హృదయం ఎంతో ప్రేమతో నిండి పోయింది. వెలకట్టలేని మీ ప్రేమ, ప్రార్థనలు, ఆప్యాయతలకు ధన్యవాదాలు' అంటూ అనుష్క ఇన్స్టాగ్రామ్ వేదికగా కోహ్లి,కూతురుతో కలిసి ఉన్న ఫోటోను షేరు చేసింది.
తమ కుమార్తెను ఫోటోలు తీయవద్దని.. చిన్నారి ప్రైవసి భంగం కలిగించవద్దంటూ మీడియా విరుష్క దంపతులు రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇన్‌స్ట్రాగామ్ వేదికగా కూతురు ఫోటోను షేరు చేశారు అనుష్క. ఇప్పుడు ఇద్దరూ కుమార్తె యొక్క మొదటి చిత్రాన్ని స్వయంగా పంచుకున్నారు.
జనవరి నెల రెండో వారం అనుష్క శర్మ పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కోహ్లీ ట్విట్టర్, ఇన్ స్టా వేదికగా తెలిపాడు. అనుష్క శర్మ ఈ మధ్యాహ్నం పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పాప, అనుష్క శర్మ ఇద్దరూ ఆరోగ్యం ఉన్నట్లు కోహ్లీ తెలిపాడు. ఈ సమయంలో దయ చేసి ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోహ్లీ ఫ్యాన్స్ ను కోరాడు. ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న కోహ్లీ పితృత్వపు సెలవుల మీద కోహ్లీ భారత్ కు తిరిగొచ్చాడు. ఈ వార్తను కోహ్లీ స్వయంగా సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. `మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాము.
2021 జనవరిలో పండంటి బిడ్డ రాబోతోందని కోహ్లీ గతేడాది ఆగస్టులో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 'ఇవాళ మధ్యాహ్నం మాకు కూతురు పుట్టిందన్న విషయాన్ని మీతో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. అనుష్క, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు, మా జీవితంలో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సమయంలో మా ప్రైవసీని మీరంతా గౌరవిస్తారని ఆశిస్తూ.. ప్రేమతో మీ విరాట్' అంటూ కోహ్లీ ఓ లేఖను ట్విటర్లో పోస్ట్ చేశాడు.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.