Home /News /sports /

VIRAT KOHLI ANUSHKA SHARMA GLAD TO HAVE NEWLY WED KATRINA KAIF VICKY KAUSHAL AS TO BE NEIGHBOURS JNK

Virat Kohli: కొత్తగా పెళ్లైన కత్రీనా-విక్కీ కౌషల్ జంట ఉండేది కోహ్లీ ఇంటి ఎదురుగానే.. అనుష్క హిలేరియస్ పోస్టు

కోహ్లీ ఇంటి ఎదుటకు రానున్న విక్కీ కౌషల్ - కత్రినా కైఫ్ జోడి

కోహ్లీ ఇంటి ఎదుటకు రానున్న విక్కీ కౌషల్ - కత్రినా కైఫ్ జోడి

Virat Kohli: విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోకే కొత్తగా పెళ్లైన కత్రినా కైఫ్ - విక్కీ కౌషల్ రాబోతున్నారు. ఈ సందర్భంగా అనుష్క శర్మ ఒక హిలేరియస్ పోస్టు పెట్టింది. అది చూసి ఫ్యాన్స్ తెగనవ్వుకుంటున్నారు.

    బాలీవుడ్ (Bollywood) స్టార్స్ విక్కీ కౌషల్ (Vickey Kaushal) - కత్రీనా కైఫ్ (Katrina Kaif) పెళ్లి చేసుకొని ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లి రిసెప్షన్‌కు బాలీవుడ్ ప్రముఖులతో పాటు క్రికెటర్లు, రాజకీయ నాయకులు కూడా హాజరై ఆశీర్వదించారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)- బాలీవుడ్ నటి అనుష్క (Anushka Sharma) జంట కూడా వీరికి శుభాకాంక్షలు తెలిపారు. 'జబ్ తక్ హై జాన్' సినిమాలో అనుష్క- కత్రినా కలసి నటించారు. విక్కీ-కత్రీనా పెళ్లి సందర్భంగా అనుష్క శర్మ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. 'అందమైన జంటకు శుభాకాంక్షలు. జీవితాంత మీరిద్దరూ కలసి ఉండాలని.. ప్రేమతో ఒకరినొకరు అర్దం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఎట్టకేలకు మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక ఎదురుగా ఉన్న ఇంట్లోకు త్వరలోనే వస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఆ కన్‌స్ట్రక్షన్ సౌండ్స్ ఇకనైనా ఆగిపోతాయని భావిస్తున్నాను' అని అనుష్క శర్మ ఆ పోస్టులో పేర్కొన్నది.

    పెళ్లి తర్వాత విక్కీ కౌషల్ - కత్రినా కైఫ్ జంట ముంబై జుహూలోని సీఫేసింగ్ అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే అపార్డ్‌మెంట్‌లో టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ నటి అనుష్క శర్మలు నివసిస్తున్నారు. వారికి ఆ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లోర్లు ఉన్నాయి. కత్రినా కైఫ్ పెళ్లికి ముందు చెల్లి ఇసాబెల్లా కైఫ్‌తో.. విక్కీ కౌషల్ తన కుటుంబంతో ముంబైలోని అంధేరీలో నివాసం ఉండే వాళ్లు. ఇప్పుడు కోహ్లీ ఇంటి ఎదురుగా కొన్న కొత్త ఫ్లాట్‌లోకి వస్తున్నారు.












    View this post on Instagram






    A post shared by Katrina Kaif (@katrinakaif)






    సవాయ్ మధుపుర్ సిక్స్ సెన్స్ కోటలో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెహందీ ఫంక్షన్, సంగీత్ అన్నీ భారీగా నిర్వహించారు. అతిథులను ఆహ్వానించినా.. వారి సెల్ ఫోన్లు మాత్రం తీసుకొని రావద్దని ఆదేశించారు. పూర్తిగా ప్రైవేటు వ్యవహారంలా ఈ వేడుక సాగింది. మరోవైపు బాలీవుడ్ తారలతో పాటు క్రికెటర్లు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు.

    Team India: ఇకపై టీమ్ ఇండియాలో చోటు దక్కాలంటే కష్టపడాల్సిందే.. గాయాల పాలైన క్రికెటర్లకు కొత్త సవాలు








    కోహ్లీ-అనుష్క నివసిస్తున్న ఫ్లాట్ ఖరీదు 2017లోనే రూ. 34 కోట్లు. అప్పట్లో సింగిల్ ఫ్లోర్‌లో ఉండే వాళ్లు. ఆ తర్వాత మరో ఫ్లోర్ కూడా కొని.. మొత్తం డ్యూప్లెక్స్ ఫ్లాట్‌గా మార్చేశారు. ఇప్పుడు కత్రినా - కౌషల్ కూడా ఒక ఫ్లాట్ తీసుకొని వారికి నచ్చిన విధంగా డిజైన్ చేసుకున్నారు. అందుకే ఆ నిర్మాణానికి సంబంధించిన శబ్దాలు ఇకపై వినపడవు అని అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: Anushka Sharma, Katrina Kaif, Team india, Virat kohli

    తదుపరి వార్తలు