విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు ఈ ఏడాది స్పెషల్ కానుంది. ఎందుకంటే ఈ ఏడాదే తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు ఈ జంట. జనవరిలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది అనుష్క శర్మ. గతేడాది న్యూ ఇయర్ వేడుకలను స్విట్జర్లాండ్ లో సెలబ్రేట్ చేసుకున్న విరుష్క దంపతులు..ఈ సారి మాత్రం సైలెంట్ గా ఫ్రెండ్స్ తో గడిపారు. కరోనా ఎఫెక్ట్ తో తమ ఇంట్లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో విరాట్ కోహ్లీ దంపతులతో పాటు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య-నటషా జంట స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. కొవిడ్ పరీక్షల్లో నెగటివ్ వచ్చిన తర్వాత ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.‘నెగెటివ్‌గా తేలిన మిత్రులందరూ కలిసి సానుకూల సమయాన్ని ఒకేచోట కలిసి ఆస్వాదించారు! ఇంట్లో సురక్షిత వాతావరణంలో కలుసుకోవడానికి మించి ఏదీ సాటిరాదు. ఈ కొత్త ఏడాది ఆశలు, ఆనందం, మంచి ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నా! నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని కోహ్లీ అన్నాడు.
View this post on Instagram
కోహ్లీతో పాటు అనుష్కశర్మ, హార్దిక్ పాండ్యతో పాటు నటాషా స్టానికోవిచ్ కలిసి విందును ఆరగించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం విరాట్, పాండ్య భారత్‌లోనే ఉన్నారు. అనుష్క శర్మ ఈ నెలలోనే ప్రసవించే అవకాశం ఉండటంతో పితృత్వపు సెలవుల మీద కోహ్లీ భారత్ కు తిరిగొచ్చాడు.టెస్టు ఫిట్‌నెస్ సాధించకపోవడంతో హార్దిక్ పాండ్య సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపికవ్వలేదు. అందులోనూ తన కుమారుడు, భార్యను చూసి నాలుగు నెలలు గడవడంతో ముంబైకి తిరిగి వచ్చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Sharma, Bolllywood, Hardik Pandya, Kohli, New Year 2021, Virat kohli