Home /News /sports /

VIRAT KOHLI ANGRY ON FAN WHO MISBEHAVING WITH ON FIELD PLAYE KAMALESH NAGARKOTI SJN

Virat Kohli : ’ఇంగ్లండ్ లో ఉన్నానని కొవ్వా‘.. టీమిండియా ఫ్యాన్ ను చెడామడా తిట్టిన కింగ్ కోహ్లీ.. ఇంతకీ ఏం జరిగిందంటే?

PC : TWITTER

PC : TWITTER

Virat kohli : భారత్ (India) క్రికెట్ మ్యాచ్ ఆడుతుందంటే ఏ దేశంలో అయినా సరే స్టేడియాలు కిక్కిరిసిపోవాల్సిందే. అంతలా మన భారతీయులు(Indians) విదేశాల్లో సెటిల్ అయ్యారు. అయితే అక్కడ ఎక్కువ రోజులు ఉండటమో లేక ఇండియా అంటే చిన్న చూపో కానీ.. కొందరు మాత్రం తమ మూలాలను విస్మరించి అతి చేస్తూ ఉంటారు.

ఇంకా చదవండి ...
Virat kohli : భారత్ (India) క్రికెట్ మ్యాచ్ ఆడుతుందంటే ఏ దేశంలో అయినా సరే స్టేడియాలు కిక్కిరిసిపోవాల్సిందే. అంతలా మన భారతీయులు(Indians) విదేశాల్లో సెటిల్ అయ్యారు. అయితే అక్కడ ఎక్కువ రోజులు ఉండటమో లేక ఇండియా అంటే చిన్న చూపో కానీ.. కొందరు మాత్రం తమ మూలాలను విస్మరించి అతి చేస్తూ ఉంటారు. తాజాగా అటువంటి సంఘటనే ఇంగ్లండ్ (England) ఒకటి చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు ఉన్న సంగతి తెలిసిందే. రీషెడ్యూల్ టెస్టు వచ్చే నెల 1వ తేదీ నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు లీసెస్టర్ షైర్ తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఆట మూడో రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి : కోహ్లీ చేతిపై ఉన్న 11 టాటూల వెనుక ఉన్న కథలేంటో మీకు తెలుసా?

భారత క్రికెట్ జట్టు నెట్ బౌలర్ కమలేశ్ నాగర్ కోటిని సదరు ఇంగ్లండ్ లోని ఓ అభిమాని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. బౌండరీ లైన్ దగ్గర నాగర్ కోటి ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో ఆ అభిమాని హేళన చేశాడు. సదరు అభిమాని నాగర్ కోటిని సెల్ఫీ అడిగినట్లు ఉన్నాడు. అయితే తాను ఫీల్డింగ్ చేస్తున్నానని ఇప్పుడు ఇవ్వలేని నాగర్ కోటి బదులు ఇవ్వగా.. నువ్వేమీ టీమిండియా ప్లేయర్ వి కాదు అంత బిల్డప్పా అన్నట్లు కామెంట్స్ చేసినట్లు ఉన్నాడు. అంతే కాకుండా పదే పదే సెల్ఫీ సెల్ఫీ అంటూ విసింగించాడు. ఇదంతా బాల్కనీ నుంచి చూస్తోన్న కోహ్లీకి ఆగ్రహం తెప్పించింది. అంతే.. సదరు అభిమానిని ఎడాపెడా తిట్టిపడేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



ఇక ప్రాక్టీస్ మ్యాచ్ విషయానికి వస్తే.. కీలక టెస్టు మ్యాచ్ కు ముందు భారత్ కు మంచి ప్రాక్టీసే లభించిందని చెప్పాలి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడటం ఇప్పుడు భారత్ ను కలవరపెట్టే అంశం. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 364 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (67; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (56 నాటౌట్; 10 ఫోర్లు), శ్రీకర్ భరత్ (43; 7 ఫోర్లు) రాణించారు. లీసెస్టర్ బౌలర్లలో నవ్ దీప్ సైనీ 3 వికెట్లు, నాగర్ కోటి 2 వికెట్లు తీశారు. ఆటకు నేడు చివరి రోజు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Hardik Pandya, India vs england, Mohammed Shami, Mohammed Siraj, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు