Virat Kohli : కోల్ కతా (Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో నెగ్గిన టీమిండియా (Team India) మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. శ్రీలంక నిర్దేశించిన (Sri Lanka) 216 పరుగుల లక్ష్యాన్ని 43.2 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి ఛేదించేసింది. దాంతో సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. కేఎల్ రాహుల్ (103 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (53 బంతుల్లో 36; 4 ఫోర్లు) రాణించారు. చివర్లో అక్షర్ పటేల్ (21 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడాడు. చివర్లో కుల్దీప్ యాదవ్ (10 నాటౌట్) ఫోర్ తో మ్యాచ ను ఫినిష్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ తన డ్యాన్స్ తో అదరగొట్టాడు.
మ్యాచ్ అనంతరం ఈడెన్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకుంది. బెంగాల్ క్రికెట్ సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక లేజర్ షోలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టెప్పులతో అదరగొట్టాడు. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ తో కలిసి పంజాబీ స్టైయిల్ లో డ్యాన్స్ ఇరగదీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతుంది.
Virat Kohli & Ishan Kishan dancing during the light show at Eden. pic.twitter.com/WRw8Xb5msC
— Johns. (@CricCrazyJohns) January 13, 2023
ఇక మ్యాచ్ విషయానికి వస్తే స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు తొలి వన్డేలో లాగా ఈసారి శుభారంభం లభించలేదు. 2 ఫోర్లు, 1 సిక్స్ తో 17 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. 5 ఫోర్లతో 12 బంతుల్లోనే 21 పరుగులు చేసిన శుబ్ మన్ గిల్ తమకు లభించిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మరల్చలేకపోయారు. తొలి వన్డే సెంచరీ హీరో విరాట్ కోహ్లీ (4) విఫలం అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (28) ఫర్వాలేదనిపించాడు. అయితే భారత్ ఒక దశలో 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకున్నారు. తక్కువ లక్ష్యమే కావడంతో వీరు నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరు 5వ వికెట్ కు 75 పరుగులు జోడించారు. అనంతరం హార్దిక్ పెవిలియన్ కు చేరాడు. అనంతరం వచ్చిన అక్షర్ పటేల్ వేగంగా పరుగులు చేశాడు. చివర్లో కుల్దీప్ యాదవ్ (10 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి రాహుల్ మ్యాచ్ ను ముగించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs srilanka, KL Rahul, Kolkata, Team India, Virat kohli