Virat Kohli : క్రికెట్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అతడి భార్య అనుష్క శర్మ (Anushka Sharma) తొందర్లోనే తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ తర్వాత కింగ్ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. దాంతో అతడు తన సతీమణితో కూతురు వమిక తో కలిసి హాలిడేస్ ను ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్లాడు. ఎక్కడికి వెళ్లింది చెప్పకపోయినా.. బీచ్ ల దగ్గర దిగిన ఫోటోలను బట్టి చూస్తే విరుష్క జంట మాల్దీవువులకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ట్రిప్ మొత్తాన్ని కూడా అనుష్క శర్మ ఫోటోలతో బంధించి.. తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకున్న సంగతి తెలిసిందే.
ఇక ట్రిప్ ను పూర్తి చేసుకున్న ఈ జంట సోమవారం మళ్లీ ఇండియాలో అడుగు పెట్టారు. ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వీరు అనంతరం ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించారు. అయితే సాయంత్రం ముంబైలోని కోకిలా బెన్ అంబానీ హాస్పిటల్ వద్ద వీరిద్దరూ కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. హాస్పిటల్ నుంచి రేంజ్ రోవర్ కార్లో వీరు బయటకు రావాడాన్ని ఒకరు వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరూ ఎందుకు హాస్పిటల్ కు వెళ్లారనేది మాత్రం తెలియరాలేదు.
కొందరు అభిమానులు అయితే అనుష్క శర్మ మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యిందని పేర్కొంటున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని వీరు వెల్లడించే అవకాశం ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటం.. అదే సమయంలో వీరు విదేశాల నుంచి రావడంతో ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవడానికి హాస్పిటల్ కు వెళ్లారేమో అని అనుకుంటున్నారు. ఈ వార్తల్లో ఏదీ నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
View this post on Instagram
ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతుంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. నేడు వైజాగ్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టి20 జరగనుంది. ఈ సిరీస్ అనంతరం భారత్ ఇంగ్లండ్ టూర్ కు బయల్దేరనుంది. అక్కడ ఇంగ్లండ్ తో గతేడాది వాయిదా పడ్డ ఐదో టెస్టుతో పాటు వన్డే సిరీస్ ఆడనుంది. అనంతరం అక్కడి నుంచి వెస్టిండీస్ కు వెళ్లి అక్కడ వన్డే, టి20 సిరీస్ ఆడనుంది. ఇక గత కొంతకాలంగా ఫామ్ తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ లు చాలా ముఖ్యం. వీటిలో రాణిస్తేనా అతడికి ప్రపంచకప్ జట్టులో చోటు ఉంటుంది. లేదంటే వేటు పడినా ఆశ్యర్యపోనక్కర్లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Sharma, India vs South Africa, Rohit sharma, Team India, Virat kohli