Home /News /sports /

VIRAT KOHLI AND ANUSHKA SHARMAS CUTE DAUGHTER VAMIKA SPOTTED IN THIRD ODI AGAINST SOUTH AFRICA WATCH VIRAL VIDEO SRD

Anushka Sharma With Vamika : అచ్చం తండ్రి పోలిక.. కోహ్లీ ముద్దుల తనయను చూశారా..?

Anushka Sharma With Vamika

Anushka Sharma With Vamika

Anushka Sharma With Vamika : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముద్దుల తనయ వామిక ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలిసిపోయింది.

    టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ముద్దుల తనయ వామిక (Vamika) ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలిసిపోయింది. విరాట్-అనుష్కశర్మ (Anushka Sharma)లు పలుమార్లు వామిక ఫోటోను షేర్ చేసినా అది వెనకనుంచే.. వామిక ముఖం ఎలా ఉంటుందో ఆమెను చూసినవాళ్లకు తప్ప వేరేవాళ్లకు తెలియదు. కోహ్లి-అనుష్క అభిమానులతో పాటు టీమిండియా అభిమానులు కూడా వామికను విరాట్ ఎప్పుడు పరిచయడం చేస్తాడని ఎదురుచూస్తున్నారు. కానీ.. విరుష్క జోడి వామికను పరిచయం చేయకుండానే టీవీలో ప్రత్యక్షమైంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో అనుష్క శర్మతో ఉన్న వామికా కెమెరా కంటికి చిక్కింది. గతేడాది కాలంగా మీడియా కంటపడకుండా.. ఫొటోలు రిలీజ్ చేయకుండా తమ కూతుర్ని దాస్తున్న కోహ్లీ-అనుష్కల ప్రయత్నం భగ్నమైంది. సఫారీ టూర్ కు విరాట్ కోహ్లీ సతీసమేతంగా వచ్చాడు. అయితే కేప్ టౌన్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డేకు అనుష్క శర్మ వామికాతో కలిసి హాజరైంది. అక్కడ వారిద్దరూ కలిసి ఉన్న దృశ్యం టీవీ కెమెరాల్లో రికార్డు అయింది.

    విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ తర్వాత అనుష్క శర్మ, వామికా కెమెరాకు చిక్కారు. విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ తర్వాత వామికను ఉద్దేశించి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. రీప్లేలో కనిపించడంతో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్​గా మారాయి. అభిమానులు ఈ ఫొటో, వీడియోను ట్రెండింగ్​ చేస్తూ విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ చేస్తున్నారు. అచ్చం కోహ్లీలానే ఉందంటూ అభిమానులు పొంగిపోతున్నారు.


    తమ అభిమాన క్రికెటర్ ముద్దుల తనయను చూడాలని అభిమానులు చాలా కాలంగా ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ విరుష్క జోడీ మొదట్నుంచి వామికకు సంబంధించిన ఫొటోలు, ఆమె ముఖాన్ని మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అప్పుడప్పుడు ముఖం కనిపించడకుండా ఉన్న పాప ఫొటోలను పోస్ట్​ చేశారు. ఈ క్రమంలోనే వామికా కోసం అందరిలో ఆతృత నెలకొంది.


    సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు ఎయిర్ పోర్ట్‌లో వామికా ఫొటో కోసం ఫొటోగ్రాఫర్లు తెగ ప్రయత్నించారు. మీడియా కంటపడకుండా అనుష్క వామికాను అదిమి పట్టడంతో చిన్నారి రూపం సగమే కెమెరాలకు చిక్కింది. అయితే ఫొటోగ్రాఫర్లపై విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతేడాది జనవరి 11న పుట్టిన వామికా.. సౌతాఫ్రికా పర్యటనలోనే తొలి బర్త్‌డే జరుపుకుంది. అయితే పుట్టినప్పటి నుంచి తన కూతురిని మీడియాకు దూరంగా ఉంచాలని భావించిన విరుష్క దంపుతులు.. మీడియా చానెళ్లన్నటికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Anushka Sharma, India vs South Africa, Viral Video, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు