• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • VIRAT KOHLI AND ANUSHKA SHARMA LATEST VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA SRD

Viral Video : కోహ్లీని అమాంతం ఎత్తేసిన అనుష్క...ఆ టైంలో కోహ్లీ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే నవ్వులే..

Viral Video : కోహ్లీని అమాంతం ఎత్తేసిన అనుష్క...ఆ టైంలో కోహ్లీ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే నవ్వులే..

విరుష్క జోడి (Photo Credit : Instagram)

Viral Video : కోహ్లీ, అనుష్కల జంట ఏది చేసినా ట్రెండింగ్ గానే ఉంటుంది. లేటెస్ట్ గా వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

  • Share this:
    విరుష్క జంట ఏది చేసినా స్పెషల్ గా ఉంటుంది. ఈ దంపతులు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ఆటతో కోహ్లీ (Virat Kohli).. సినిమాలతో అనుష్క (Anushka Sharma) ఫుల్ బిజీ. ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఎప్పటికప్పుడు తమకు సంబందించిన ప్రతి విషయాన్ని విరుష్క జోడి అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలో అనుష్క బుధవారం ఇన్‌స్టాలో పంచుకున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.ఇందులో భర్త కోహ్లిని అనుష్క ఎత్తుకున్నారు. గతంలో చేసిన ఓ యాడ్ షూట్‌కు సంబందించిన ఘటనను అనుష్క శర్మ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. సెట్‌లో ఉన్న విరాట్ కోహ్లీని.. వెనుక నుంచి కౌగిలించుకున్నారు అనుష్క. ఆ త‌ర్వాత త‌న భ‌ర్త‌ను ఈజీగా రెండు చేతుల‌తో పైకి లేపారు. అనుష్క లిఫ్టింగ్ స్టంట్స్ చూసిన కోహ్లీ.. ఓ తేరీ అంటూ షాక్ అయ్యాడు. మ‌రోసారి పైకి లేపాలంటూ అనుష్కను కోరాడు. ఎటువంటి హెల్ప్ తీసుకోకుండానే.. మ‌ళ్లీ విరాట్‌ను త‌న చేతుల‌తో బిగించి అనుష్క సునాయాసంగా ఎత్తుకున్నారు. ఆపై అనుష్క యాహూ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆ వీడియోను పోస్టు చేసిన అనుష్క శర్మ.. "ఇది నేనే చేశానా" అంటూ కామెంట్ పెట్టారు. అనుష్క పెట్టిన కామెంట్‌కు విరాట్ కోహ్లీ కూడా రిప్లై ఇచ్చాడు. ఇక ఆ వీడియోకు అతి త‌క్కువ స‌మ‌యంలోనే తెగ లైక్‌లు వ‌చ్చేశాయి. ఈ వీడియోను వీక్షించిన అభిమానులు "సూపర్‌ అనుష్క", "మీ జంట ఎల్లప్పుడూ కలిసి ఉండాలి", "మీరిద్దరూ మాకు ఇలాగే వినోదం పంచుతూ ఉండాలి" అని కామెంట్లు చేస్తున్నారు.

    ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2021 కోసం చెన్నైలో ఉన్నాడు. అనుష్క కూడా కోహ్లీతో పాటే ఉన్నారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకుని.. ఐదారేళ్లు లవ్‌లో ఉన్నారు. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు విరుష్క జోడి ప్రకటించింది. అనుష్క డెలివరీ సమయంలో ఆమె చెంత ఉండేందుకు పెటర్నటీ లీవ్‌పై కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేశాడు. గత జనవరి 11న కుమార్తెకు జన్మనిచ్చారు. పాప పుట్టిన 21 రోజుల అనంతరం అనుష్క తన మొదటి ఫొటోను షేర్ చేసి చిన్నారి పేరు వామికాగా వెల్లడించారు.



    ఇక, ఈ ఏడాది ఐపీఎల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ లో ఇంతవరకు టైటిల్ కొట్టని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఈ సారి విజయం వైపు నడిపించాలన్న కసితో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఏప్రిల్ ‌9వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ ప్రారంభం కానుంది. ఈ సారి కూడా పేపర్ మీద స్ట్రాంగ్ గా ఉంది ఆర్సీబీ. మరి, ఈ సారైనా టైటిల్ కొడుతుందో లేదో చూడాలి.
    Published by:Sridhar Reddy
    First published: