news18-telugu
Updated: December 1, 2020, 7:20 PM IST
విరాట్ కోహ్లీ(ఫైల్ ఫోటో)
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బౌలర్ల వైఫల్యంతో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు అప్పగించేసింది టీమిండియా. బ్యాట్స్‌మన్ సమిష్టి ఆటతీరు బాగానే ఉన్నా.. బౌలింగే పెద్ద తలనొప్పిగా మారింది. ఐపీఎల్ లో ఇరగదీసిన యార్కర్ల కింగ్ నటరాజన్‌కు అవకాశం ఇవ్వకుండా సైనీని ఆడించడం పట్ల సోషల్ మీడియాలో కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు కూడా వస్తున్నాయి. కేవలం బౌలర్ల వైఫల్యమే టీమిండియా సిరీస్ ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. రేపు ఆస్ట్రేలియాతో జరగబోయే మూడో వన్డేలో మరో 23 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా కోహ్లి నిలుస్తాడు. దీంతో కోహ్లి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. సచిన్ ఈ ఘనతను అందుకోవడానికి 309 మ్యాచ్‌ల్లో 300 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. కానీ కోహ్లి ఆ 23 పరుగులు చేస్తే 242వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత అందుకున్న ఆటగాడిగా రికార్డుకెక్కుతాడు.
ఇక మొత్తంగా చూసుకుంటే వన్డేల్లో 12 వేల పరుగులు చేసిన వారిలో కోహ్లి ఆరో ప్లేయర్‌గా నిలవనున్నాడు. ఇంతకు ముందు సచిన్‌తో పాటు రికీ పాంటింగ్, కుమార సంగక్కర, సనత్ జయసూర్య, మహేల జయవర్దనె కూడా వన్డేల్లో 12 వేల పరుగులు సాధించిన లిస్ట్ లో ఉన్నారు. అంతేగాక కోహ్లి ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా సచిన్ సరసన నిలవనున్నాడు. సచిన్ ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు చేశాడు.
Published by:
Anil
First published:
December 1, 2020, 7:20 PM IST