Kohli - Kishan: టీ20 వరల్డ్ కప్‌పై కోహ్లీ ఆందోళనలో ఉన్నాడా? ముంబై మ్యాచ్ తర్వాత వైరల్‌గా మారిన ఫొటో

విరాట్ కోహ్లీ ఆందోళనలో ఉన్నాడా? వైరల్‌గా మారిన ఫొటో (PC: Twitter)

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆందోళనలో ఉన్నాడా? ముంబై ఇండియన్స్‌కు చెందిన ఆ ముగ్గురు ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడంపై ఆందోళన చెందుతున్నాడా?

  • Share this:
    ఐసీసీ (ICC) పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) తర్వాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతానని విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇప్పటికే చెప్పేశాడు. ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌లో (IPL) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టుకు కూడా నాయకత్వం వహించనని తేల్చి చెప్పాడు. ఈ ప్రకటన చేసే సమయంలో కోహ్లీ ఎంతో భావోద్వేగంతో కనిపించాడు. అయితే విరాట్ కోహ్లీ ఐపీఎల్ కంటే టీ20 వరల్డ్ కప్‌పై చాలా ఆందోళనగా ఉన్నాడని సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కోహ్లీ ఖాతాలో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా లేదు. ద్వైపాక్షిక సిరీస్‌లలో మంచి విన్నింగ్ రికార్డు ఉన్నా.. వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలు మాత్రం కోహ్లీ ఎన్నడూ గెలవలేదు. ఇక ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగానే జరుగనున్నది. కెప్టెన్‌గా పొట్టి ఫార్మాట్‌లో ఇదే చివరి టోర్నీ కావడంతో ఎలాగైనా విజేతగా నిలవాలని భావిస్తున్నాడు. అయితే వరల్డ్ కప్ కోసం సెలెక్టర్లు ఎంపిక చేసిన క్రికెటర్ల ఫామ్ చూసి కోహ్లీ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తున్నది.

    ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించిన ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహర్‌లు టీ20 స్క్వాడ్‌లోకి స్థానం సంపాదించారు. గత సీజన్‌లో పరుగుల వరద పారించి ముంబై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన కిషన్, సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఐపీఎల్ రెండో దశలో ఇషాన్ కిషన్ మూడు మ్యాచ్‌లలో 11, 14, 9 పరుగుల ప్రదర్శన చేశాడు. అతడి సగటు 11.37గా ఉన్నది. కానీ గత సీజన్‌లో ఇషాన్ కిషన్ 57.33 సగటుతో 516 పరుగులు చేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2021లో 18.90 సగటుతో పరుగులు చేస్తున్నాడు. గత మూడు మ్యాచ్‌లలో స్కై 3, 5, 8 పరుగుల ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పూర్తిగా విఫలం అయ్యాడు. హార్దిక్ పాండ్యా కూడా పూర్తిగా ఫిట్‌నెస్‌తో లేడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేశాడు.

    Ranji Trophy: రంజీ జట్టుకు అంతర్జాతీయ కోచ్.. ఆస్ట్రేలియా నుంచి భారీ వేతనంతో బరోడాకు కోచింగ్







    టీ20 వరల్డ్ కప్ జట్టులో కీలక సభ్యులైన వీళ్లు ఫామ్ లేమితో ఉండటం కింగ్ కోహ్లీకి ఇబ్బంది కరంగా మారింది. ఆదివారం ముంబైతో మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ ముంబై ఆటగాడు ఇషాన్ కిషన్‌తో సుదీర్ఘంగా చర్చించాడు. మైదానంలో వీళ్లిద్దరూ మాట్లాడుకోవడం కెమేరాల కంట పడింది. ఇషాన్ కిషన్ భుజంపైన చేయివేసిన కోహ్లీ సీరియస్‌గా సలహాలు ఇస్తున్నట్లు కనిపించాడు. రాబోయే ప్రపంచ కప్‌లో కిషన్ కీలక పాత్ర పోషించాల్సి ఉన్నది. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న కిషన్‌ను విరాట్ కోహ్లీ ఊరడించే ప్రయత్నం చేశాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. కోహ్లీ టీ20 వరల్డ్ కప్‌పై ఎంత ఫోకస్ చేశాడో ఈ ఫొటోలే నిదర్శనం అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. టీమ్ ఇండియాలోని ఆటగాళ్లలో ఇప్పటి నుంచే స్పూర్తి నింపేందుకు కోహ్లీ ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు.
    Published by:John Naveen Kora
    First published: