దాదాపు 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై ఇంగ్లండ్ (PAK vs ENG) అడుగుపెట్టింది. ఇక, అసలైన మజా లభిస్తుందని పాకిస్తాన్ ఫ్యాన్స్ తో క్రికెట్ లవర్స్ కూడా భావించారు. అయితే, ఇంగ్లండ్, పాక్ ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో పరుగుల వరద పారుతుంది. కానీ, ఫ్యాన్స్ కు మాత్రం అసలైన మజా రావడం లేదు. వన్డే, టీ20ల్లో అయితే ఇలాంటి పరుగుల సునామీని చూసి ఎంజాయ్ చేసేవారేమో. కానీ, సంప్రదాయ క్రికెట్ లో బంతికి.. బ్యాట్ కు మధ్య సమాన పోరు ఉంటేనే అసలైన కిక్ వస్తుంది. ర్జీవమైన పిచ్‌ను ఏర్పాటు చేయడంపై పాకిస్థాన్ అభిమానులు సైతం పాక్ క్రికెట్ బోర్డుపై మండిపడుతున్నారు. మూడో రోజుల ఆటలో ఇప్పటికే ఏడు సెంచరీలు నమోదయ్యాయి. అందులు నాలుగు సెంచరీలు ఇంగ్లండ్ ఆటగాళ్లు బాదగా.. మూడు సెంచరీలు పాక్ ఆటగాళ్లు చేశారు. దీంతో.. ఈ మ్యాచుపై ఆసక్తి తగ్గింది.
అయితే, ఈ మ్యాచులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చేసి పని మాత్రం హైలెట్ గా నిలిచింది. తమ జట్టు బౌలింగ్ చేస్తుండగా రూట్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. విల్ జాక్స్ తన ఓవర్ ముగించాడు. అప్పటికి 72 ఓవర్లు ముగిశాయి. ఓలీ రాబిన్సన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో బంతిని ఒక వైపు షైన్ చేయడం క్రికెటర్లకు అలవాటు. బంతి తమ చేతికి వచ్చిన ప్రతిసారీ ఉమ్మితో ఒక వైపు షైన్ చేసేవారు. అయితే కరోనా తర్వాత ఉమ్మి వాడకంపై ఐసీసీ నిషేధం విధించింది.
"Absolutely ingenious!" Root finds a unique way of shining the ball with the help of Leach ????????#PAKvENG | #UKSePK pic.twitter.com/mYkmfI0lhK
— Pakistan Cricket (@TheRealPCB) December 3, 2022
దీంతో.. పాతబడుతున్న బంతి మెరిపించేందుకు సరికొత్త పద్దతిని కనిపెట్టాడు. ఇంతవరకు ఎవరూ చేయని కొత్త ట్రిక్‌తో బంతిని మెరిపించే ప్రయత్నం చేశాడు రూట్. తన సహచర ఆటగాడు జాక్ లీచ్ బట్టతలపై బాల్‌ను రుద్ది.. నవ్వులు పూయించాడు. బౌలింగ్ మార్పు కోసం అందరు ఆటగాళ్లు ఒక చోట గుమ్మిగూడిన టైమ్‌లో జాక్ లీచ్ తనపై క్యాప్ తీసిన రూట్.. బాల్‌ను లీచ్ బట్టతలపై సుతిమెత్తగా తిప్పాడు. దీంతో బాల్‌కు అతని బట్టతలపై ఉన్న చెమట అంటింది. మళ్లీ దాన్ని హ్యాండ్ టవల్‌తో గట్టిగా రుద్దుతూ.. బంతిని మెరిపించేందుకు ట్రై చేశాడు.
ప్రస్తుతం రూట్ చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాల్‌ను షైన్ చేయడానికి రూట్ కొత్త పద్దతి కనిపెట్టాడంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో సైతం వీడియో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇక, వీడియోపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇది మాములు వాడకం కాదంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగుతుంది. అద్భుతాలు జరిగితే తప్ప ఈ మ్యాచులో విజేతను చూడటం కష్టమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, England, Pakistan, Viral Video