టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లి(Virat Kohli) కీలక నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో జరగబోయే టి20 వరల్డ్ కప్ తరువాత కెప్టెన్సీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించాడు. ఈ ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్(T20 World Cup) తరువాత కెప్టెన్సీని వదులుకోబోతున్నానని కొహ్లి తెలిపాడు. అయితే వన్డేలు, టెస్టులో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. టీమిండియా కెప్టెన్‌గా ఇంతకాలం నాయకత్వం వహించడం తన అదృష్టమని తెలిపాడు. ఈ ప్రయాణంలో తనకు మద్దతు తెలిపిన వారందరికీ కొహ్లి కృతజ్ఞతలు తెలిపాడు. అందరి మద్దతు లేకుండా తాను కెప్టెన్‌గా కొనసాగి ఉండేవాడిని కాదని అన్నాడు. ఇందుకుగానూ టీమిండియా(Team India) సభ్యులు, సెలక్షణ్ కమిటీ, కోచ్‌లు, తమ గెలుపు కోసం ప్రార్థించిన అందరికీ కొహ్లి ధన్యవాదాలు తెలిపాడు.
గత 8 నుంచి 9 ఏళ్లుగా మూడు ఫార్మాట్ల క్రికెట్లో ఆడుతూ పని ఒత్తిడిని ఎదుర్కొన్నానని కొహ్లి అన్నాడు. ఐదారేళ్ల నుంచి టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నానని పేర్కొన్నాడు. ఇదే సమయంలో టీమిండియాకు వన్డే, టెస్టుల్లో కొత్త వారికి సారథ్యం వహించే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని తాను భావించానని కొహ్లి తెలిపాడు. టి20 కెప్టెన్‌గా జట్టుకు ఎంతో చేశానని.. ఇకపై టి20 టీమ్‌లో బ్యాట్స్‌మెన్‌గా ముందుకు సాగుతానని స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు సెక్రటరీ జై షాకు తెలియజేశానని కొహ్లి చెప్పుకొచ్చాడు.
?? ❤️ pic.twitter.com/Ds7okjhj9J
— Virat Kohli (@imVkohli) September 16, 2021
ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎంతో సమయం తీసుకున్నానని కొహ్లి తెలిపాడు. తనకు సన్నిహితంగా ఉండే వారితో దీనిపై ఎంతో చర్చించానని వెల్లడించాడు. రవి భాయ్(రవిశాస్త్రి)తో పాటు రోహిత్ శర్మతో ఈ అంశాన్ని చర్చించానని తెలిపాడు.
Virat Kohli: విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఊడిపోతుందా?.. కుండబద్దలు కొట్టిన బీసీసీఐ
కోహ్లి ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. కీలక నిర్ణయం తీసుకొనున్న విరాట్..!
వీరితో మాట్లాడిన తరువాతే అక్టోబర్‌లో దుబాయ్‌లో జరగబోయే టి20 వరల్డ్ కప్ తరువాత కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. టీమిండియా సభ్యుడిగా కొనసాగి జట్టుకు సాధ్యమైనంత ఎక్కువగా సేవలు అందిస్తానని కొహ్లి మరోసారి స్పష్టం చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Team India, Virat kohli