హోమ్ /వార్తలు /క్రీడలు /

Vinod Kambli : బ్యాంకు నుంచి కేవైసీ కోసం అంటూ వినోద్ కాంబ్లీకి ఫోన్.. క్షణాల్లో ఖాతా నుంచి డబ్బు బదిలీ చేసిన సైబర్ నేరగాళ్లు

Vinod Kambli : బ్యాంకు నుంచి కేవైసీ కోసం అంటూ వినోద్ కాంబ్లీకి ఫోన్.. క్షణాల్లో ఖాతా నుంచి డబ్బు బదిలీ చేసిన సైబర్ నేరగాళ్లు

వినోద్ కాంబ్లీ  (ఫైల్ ఫోటో)

వినోద్ కాంబ్లీ (ఫైల్ ఫోటో)

Vinod Kambli: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 1.3 లక్షలు బదిలీ చేసుకున్నారు. బ్యాంకు నుంచి కేవైసీ డీటైల్స్ కోసం అంటూ కాల్ చేసి ఒక అనుమానాస్పద యాప్ ద్వారా సదరు మొత్తాన్ని ట్రాన్‌ఫర్ చేశారు.

ఇంకా చదవండి ...

దేశంలో సైబర్ నేరాలు (Cyber Crime) రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. బ్యాంకు (Bank) నుంచి ఎలాంటి కాల్స్ రావని.. ఫోన్‌లో ఎవరికీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పవద్దని ప్రతీ నిత్యం అధికారులు, పోలీసులు వినియోగదారులను హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కొంత మంది తెలిసీ తప్పులు చేసి భారీగా డబ్బులు నష్టపోతున్నారు. ఇప్పుడు ఆ బాధితుల లిస్టులో టీమ్ ఇండియా (Team India) మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) కూడా చేరాడు. భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ సైబర్ దుండగుల చేతిలో బలి అయ్యాడు. కేవైసీ (KYC) డేటాను అప్‌డేట్ చేసే పేరుతో అతడి ఖాతా నుంచి రూ.1.1 లక్షలు డ్రా అయ్యాయి. దీనిపై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కాంబ్లీ కేసు నమోదు చేశారు. పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం..

ఒక వ్యక్తి బ్యాంకు అధికారినని అంటూ కాంబ్లి మొబైల్‌కు కాల్ చేశాడు. అతని కేవైసీ డేటాను అప్‌డేట్ చేయడానికి కొన్ని వివరాలు కావాలని అడిగాడు. ఇందుకు గాను ఫోన్‌లో ఒక మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయాలని లింక్ పంపించాడు. ఇది నిజమేనని నమ్మిన వినోద్ కాంబ్లీ వెంటనే సదరు యాప్‌ను డౌన్ లోడ్ చేశాడు. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే మొబైల్‌కి రిమోట్‌ యాక్సెస్‌ లభించడంతో పాటు బ్యాంకు నుంచి వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ కూడా వచ్చింది. ఆ వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను రిమోట్ యాక్సెస్ ద్వారా తెలుసుకున్న దుండగులు వెంటనే ఖాతా నుంచి రూ.1,13, 998 బదిలీ చేసుకున్నారు. డిసెంబర్ 3న పలు ట్రాన్స్‌శాక్షన్స్ ద్వారా ఈ మొత్తాన్ని బదిలీ చేశారు.

Viral Video : ఇంగ్లండ్ అబ్బాయి.. ఆస్ట్రేలియా అమ్మాయి.. మరోవైపు మ్యాచ్.. ముద్దుల్లో ముంచెత్తి..



డబ్బు డ్రా అయిన వెంటనే కాంబ్లీకి అలర్ట్ మెసేజ్ వచ్చింది. దీంతో కాంబ్లీ వెంటనే కస్టమర్ కేర్‌కు సమాచారం అందించి అతడి బ్యాంక్ ఖాతాను బ్లాక్ చేయించాడు. తన ఖాతా నుంచి డబ్బులు డ్రా అయ్యాయంటూ బాంద్ర పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బ్యాంకు అధికారులను అలర్ట్ చేశారు. ట్రాన్స్‌సాక్షన్స్ రివర్స్ చేయించి ఆ మొత్తాన్ని తిరిగి కాంబ్లీ అకౌంట్లోకి జమ చేయించారు. ప్రస్తుతం పోలీసులు కాంబ్లీ ఖాతా నుంచి ఎవరి అకౌంట్‌కు డబ్బులు బదిలీ అయ్యాయో ఆరా తీస్తున్నారు.

Rohit Sharma Salary: వన్డే, టీ20ల కెప్టెన్‌ రోహిత్ శర్మకు జీతం పెరుగుతుందా? బీసీసీఐ అతడికి ఎంత ఇస్తుంది?



మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌తో కలసి స్కూల్ దశలో క్రికెట్ ఆడిన వినోద్ కాంబ్లీ 1991లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వినోద్ కాంబ్లీ భారత్ తరఫున 17 టెస్టు మ్యాచ్‌లు, 104 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో నాలుగు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు బాదాడు. టెస్టుల్లో మొత్తం 54 సగటుతో 1,084 పరుగులు చేశాడు. వన్డే కెరీర్‌లో అతని సగటు 32 మాత్రమే. వన్డేల్లో కాంబ్లీ బ్యాట్ నుండి రెండు సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు నమోదు అవగా.. మొత్తం 2,417 పరుగులు చేశాడు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Bank, CYBER CRIME, KYC submissionsn, Team India

ఉత్తమ కథలు