VILLAGE LIFE PEOPLE IN CITIES WONT KNOW THE FUN OF THIS VIRENDER SEHWAG POSTED A VIDEO BOY BATH ON BUFFALO WHICH GOES VIRAL SRD
Viral Video : గేదెపై పిల్లగాడి స్నానం.. ఆ కిక్కే వేరప్పా అంటున్న సెహ్వాగ్ .. బుడ్డోడి ఫీట్స్ అదుర్స్..
Photo Credit : Instagram
Viral Video : భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag).. ఎప్పటికప్పుడు సరదా కామెంట్స్, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తన పదునైన రాతలతో విమర్శకులకు ఇదే వేదిక ద్వారా జవాబిస్తుంటారు.
సోషల్ మీడియా ప్రపంచంలో తరచూ రకరకాల వీడియోలు వైరల్(Viral Video) అవుతుంటాయి. వాటిల్లో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని వెరైటీగా ఉంటాయి. ఇక అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ వీడియోను షేర్ చేసింది ఎవరో కాదు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటున్నాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag). ఎప్పటికప్పుడు సరదా కామెంట్స్, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తన పదునైన రాతలతో విమర్శకులకు ఇదే వేదిక ద్వారా జవాబిస్తుంటారు. సెహ్వాగ్ పోస్టింగ్‌ల కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారంటే అతిశయోక్తి కాదు. ఇక, లేటెస్ట్ గా వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఆయన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నది. ఈ వీడియోలో ఒక పిల్లవాడు బర్రెను పైపుతో స్నానం (Bathing on Buffalo) చేయిస్తూ.. తానూ స్నానం చేస్తూ ఆ ఎంజాయ్మెంట్ను ఆస్వాదిస్తున్నాడు. పిల్లవాడు బర్రెపైన నిలబడి, కొన్నిసార్లు కూర్చొని, మరోసారి పడుకుని నీళ్లు పోస్తూ కనిపిస్తాడు.
ఇంతకీ వీరేంద్రుడు షేర్ చేసిన వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ గేదెపైకి ఎక్కిన పిల్లాడు వాటర్ పైప్‌తో జలకాలాడుతున్నాడు. వాటర్ పైపుతో తనపై నీళ్లు పోసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ వీడియో బ్యాక్‌డ్రాప్‌లో ఓ బాలీవుడ్ పాటను యడ్ చేశారు. ఆ పాటకు, ఆ బుడ్డోడి డ్యాన్స్ సింక్ అవడంతో.. ఆ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్లో పేలుతుంది. గేదెపై పడుకుని, కూర్చుని స్నానం చేస్తూ ఆ బాలుడు చేసిన ఫీట్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ వీడియో షేర్ చేసిన సెహ్వాగ్.. గ్రామాల్లో జీవితం ఇలా సరదాగా గడిచిపోతుంటుందని, నగరాల్లో ఉన్నవారికి ఇటువంటి సరదాల గురించి తెలియదని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసి నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
ఇక, భారత క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత క్రికెట్ జట్టు ఎన్నో ఏళ్లుగా ఎదురూచూసిన ట్రిపుల్ సెంచరీ లోటును తీర్చిన వ్యక్తి సెహ్వగే. సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్‌లాంటి దిగ్గజాలకు సాధ్యం కానీ ఈ ఘనతను తనదైన శైలిలో సెహ్వాగ్ సాధించాడు. 2004లో పాకిస్థాన్‌పై తొలిసారిగా ట్రిపుల్ సెంచరీ సాధించిన సెహ్వాగ్.. మరో నాలుగేళ్లకే అంటే 2008లో దక్షిణాఫ్రికాపై ఈ ఫీట్‌ను మరోసారి రిపీట్ చేశాడు. ఇక, సెహ్వాగ్ 103 టెస్టులాడగ, 251 వన్డే మ్యాచ్ లాడాడు. వరుసగా 8,586 మరియు 8,273 పరుగులు చేశాడు. టెస్ట్ ల్లో 23 సెంచరీలు చేస్తే.. వన్డేల్లో 15 శతకాలు బాదాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.