టీమిండియాకు భారీ షాక్.. గాయంతో మరో ఆటగాడు అవుట్

ICC Cricket World Cup 2019 | IND vs BAN | నెట్‌లో ప్రాక్టీస్ చేస్తూ బుమ్రా బౌలింగ్‌లో మరోసారి విజయ్ శంకర్ గాయపడ్డాడు. దీంతో వరల్డ్ కప్ మొత్తానికే అతడు దూరం కావాల్సి వచ్చింది. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. విజయ్ శంకర్ స్థానంలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 1, 2019, 3:49 PM IST
టీమిండియాకు భారీ షాక్.. గాయంతో మరో ఆటగాడు అవుట్
విజయ్ శంకర్
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 1, 2019, 3:49 PM IST
వరల్డ్ కప్‌లో టీమిండియాను గాయాల బెడద ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇప్పటికే శిఖర్ ధవన్ సిరీస్‌కు దూరం కాగా, పేసర్ భువనేశ్వర్ కొన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. తాజాగా, ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కూడా గాయాల బారిన పడ్డాడు. ఇప్పటికే ఒక సారి గాయపడ్డ అతడు.. నెట్‌లో ప్రాక్టీస్ చేస్తూ బుమ్రా బౌలింగ్‌లో మరోసారి గాయపడ్డాడు. దీంతో వరల్డ్ కప్ మొత్తానికే అతడు దూరం కావాల్సి వచ్చింది. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. విజయ్ శంకర్ స్థానంలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌లో అదరగొట్టని మయాంక్.. తన అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ను ఇప్పటి వరకు ఆడలేదు. నాలుగో స్థానంలో రావాల్సిన కేఎల్ రాహుల్ ధవన్ లేకపోవడంతో ఓపెనర్‌గా వస్తున్నాడు. అయితే, అంచనాలకు తగ్గట్లు రాణించడం లేదు. దీంతో మయాంక్‌ను ఓపెనర్‌గా బరిలో దించాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే, విజయ్ శంకర్ ధవన్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. అతడి తొలి మ్యాచ్‌ పాకిస్తాన్‌తో ఆల్ రౌండ్ షోను ప్రదర్శించినా.. ఆ తర్వాతి మ్యాచుల్లో అంతగా రాణించలేకపోయాడు. ఆప్ఘనిస్తాన్‌పై 29 పరుగులు, విండీస్‌పై కేవలం 14 పరుగులు చేసి తీవ్రంగా నిరాశ పరిచాడు. దీంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతడ్ని తప్పించి రిషబ్ పంత్‌కు అవకాశం కల్పించారు.

First published: July 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...