రాహుల్, హార్ధిక్ ఔట్... శుభమాన్, విజయ్ శంకర్ ఇన్... బీసీసీఐ తాజా నిర్ణయం

నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు వాగితే... ఆ క్షణం బాగానే ఉంటుంది. ఆ తర్వాతే రియాక్షన్ అదిరిపోతుంది. మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన రాహుల్, హార్ధిక్ పటేల్‌కి ఇదే శాస్తి జరుగుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: January 13, 2019, 12:54 PM IST
రాహుల్, హార్ధిక్ ఔట్... శుభమాన్, విజయ్ శంకర్ ఇన్... బీసీసీఐ తాజా నిర్ణయం
కాఫీ విత్ కరణ్ షోలో హార్థిక్ పాండ్య, కేఎల్ రాహుల్
Krishna Kumar N | news18-telugu
Updated: January 13, 2019, 12:54 PM IST
బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్‌గా చేస్తున్న కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, సస్పెండ్ అయిన కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్య స్థానాల్లోకి శుభమాన్ గిల్, విజయ్ శంకర్ వస్తున్నారు. యువ ఆటగాడైన 19 ఏళ్ల శుభమాన్ గిల్ ఎప్పటి నుంచో జట్టులో ఛాన్స్ కోసం చూస్తున్నాడు. తన కన్నా సీనియర్లకు అవకాశాలు రావడంతో సైలెంటైపోయాడు. ఇప్పుడా ఛాన్స్ దక్కింది. న్యూజిలాండ్ సిరీస్‌కి శుభమాన్ ఎంపికయ్యాడు. ఇక విజయ్ శంకర్‌ను ఆస్ట్రేలియాతో జరగాల్సి వున్న మిగతా రెండు వన్డేలకు విజయ్ శంకర్‌ను తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాన్ని బీసీసీఐ ట్విట్టర్‌ అకౌంట్‌లో అధికారికంగా తెలిపింది.

ఆస్ట్రేలియాతో రెండో వన్డే మంగళవారం అడిలైడ్‌లో జరగనుంది. రేపటికల్లా విజయ్ శంకర్, శుభమాన్ గిల్... ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలున్నాయి. భారత్‌-ఎ తరపున విజయ్‌ శంకర్‌ న్యూజిలాండ్‌ పర్యటనలో రాణించాడు. ఇప్పటికే టీ-20ల్లో టీంఇండియా తరపున ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకూ దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న శుభమాన్ గిల్ మాత్రం టీంఇండియాలోకి ఎంటరవ్వడం ఇదే మొదటిసారి. న్యూజిలాండ్ టూర్‌లో అతడు సత్తా చాటితే, అతని కెరీర్ గ్రాఫ్‌కి కలిసొచ్చే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

Loading...

నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తున్నాం... సీఎం కేజ్రీవాల్‌కు ఈ-మెయిల్ బెదిరింపు


కుక్కకి‌ పెద్దకర్మ ... ఖమ్మంలో అనుబంధాన్ని చాటుకున్న ఓ కుటుంబం


యాదాద్రి ఆలయంలోకి సూర్య కిరణాలు... ప్రత్యేక అద్దాల ఏర్పాటు

First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...