హోమ్ /వార్తలు /క్రీడలు /

Vijay Hazare Trophy 2022 : ఇదేం బాదుడు రా బాబూ.. వన్డేల్లో ఏకంగా 506 పరుగులా.. రోహిత్ రికార్డ్ ఫట్

Vijay Hazare Trophy 2022 : ఇదేం బాదుడు రా బాబూ.. వన్డేల్లో ఏకంగా 506 పరుగులా.. రోహిత్ రికార్డ్ ఫట్

PC : BCCI

PC : BCCI

Vijay Hazare Trophy 2022 : ప్రస్తుతం జరుగుతున్న దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే వన్డే ట్రోఫీ (Vijay Hazare Trophy) 2022లో తమిళనాడు (Tamil Nadu) జట్టు సంచలన ప్రదర్శన చేసింది. ఊహకందని స్కోరును సాధించి ఔరా అనిపించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Vijay Hazare Trophy 2022 : ప్రస్తుతం జరుగుతున్న దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే వన్డే ట్రోఫీ (Vijay Hazare Trophy) 2022లో తమిళనాడు (Tamil Nadu) జట్టు సంచలన ప్రదర్శన చేసింది. ఊహకందని స్కోరును సాధించి ఔరా అనిపించింది. అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు జట్టు 50 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 506 పరుగులు చేసింది. వన్డే (లిస్ట్ ‘ఎ’ను కలుపుకని) క్రికెట్ చరిత్రలో ఒక జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. ఈ మ్యాచ్ లో నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) అద్భుత డబుల్ సెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్ (102 బంతుల్లో 154; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా శతకంతో కదంతొక్కాడు. దాంతో తమిళనాడు భారీ స్కోరును సాధించింది.

ఇది కూడా చదవండి : సంజూ సామ్సన్ పై రవిశాస్త్రి సంచలన కామెంట్స్.. అలా చేసి చూడండి అంటూ హితవు

రెచ్చిపోయిన జగదీశన్

ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న జగదీశన్ మరోసారి రెచ్చిపోయాడు. వరుసగా ఐదో సెంచరీని సాధించాడు. గతంలో విరాట్ కోహ్లీ, షా, దేవ్ దత్ పడిక్కల్ లు విజయ్ హజారే టోర్నీ ఒక సీజన్ లో నాలుగు సెంచరీ చేశారు. ఇప్పుడు ఈ రికార్డును జగదీశన్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో జగదీశన్ 277 పరుగులు చేశాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ఆటగాడిగా జగదీశన్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లీష్‌ క్రికెటర్‌ అలిస్టర్ బ్రౌన్(268) పేరిట ఉండేది. అదే విధంగా భారత్‌ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన రోహిత్‌ శర్మ(264) రికార్డును జగదీశన్ బ్రేక్‌ చేశాడు. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్‌ శర్మ 264 పరుగులు సాధించాడు.

భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ 28.4 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. దాంతో తమిళనాడు జట్టు 435 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తమిళనాడు బౌలర్లలో సిద్దార్థ్ 5 వికెట్లు తీశాడు. మొహమ్మద్, రఘుపతి చెరో రెండు వికెట్లు తీశారు.

First published:

Tags: Chennai Super Kings, Csk, Rohit sharma, Team India

ఉత్తమ కథలు