హోమ్ /వార్తలు /క్రీడలు /

Vijay Hazare Trophy 2022 : మరోసారి సెంచరీతో రెచ్చిపోయిన రుతురాజ్.. ఫైనల్ చేరిన మహారాష్ట్ర, సౌరాష్ట్ర

Vijay Hazare Trophy 2022 : మరోసారి సెంచరీతో రెచ్చిపోయిన రుతురాజ్.. ఫైనల్ చేరిన మహారాష్ట్ర, సౌరాష్ట్ర

PC : BCCI

PC : BCCI

Vijay Hazare Trophy 2022 : చైన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓపెనర్.. మహారాష్ట్ర (Maharashtra) ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) మరోసారి శతకంతో మెరిశాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Vijay Hazare Trophy 2022 : చైన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓపెనర్.. మహారాష్ట్ర (Maharashtra) ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) మరోసారి శతకంతో మెరిశాడు. విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) 2022లో భాగంగా బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ (126 బంతుల్లో 168; 18 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు శతకం బాదాడు. రుతురాజ్ తో పాటు అంకిత్ బవ్నే (89 బంతుల్లో 110; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సెంచరీ చేశాడు. దాంతో అస్సాంతో జరిగిన సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్లకు 350 పరుగులు చేసింది. సత్యజీత్ (41) రాణించాడు. అస్సాం బౌలర్లలో ముక్తార్ 3 వికెట్లు తీశాడు. రియాన్ పరాగ్, అవినోవ్ చౌదరీ, రాజ్ కుదీన్ అహ్మద్ తలా ఒక వికెట్ తీశారు.

351 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన అస్సాం 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 338 పరుగులు చేసింది. దాంతో మహారాష్ట్ర 12 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్ చేరింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో అస్సాం తరఫున స్వరూపం (87 బంతుల్లో 95; 10 ఫోర్లు, 1 సిక్స్), రాయ్ (63 బంతుల్లో 78; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత పోరాటం చేశారు.  అయితే రాజవర్ధన్ హంగార్గేకర్ 4 వికెట్లతో అస్సాంను పడగొట్టాడు. మనోజ్ రెండు వికెట్లు తీశాడు. క్వార్టర్ ఫైనల్లో సెంచరీ చేసిన రియాన్ పరాగ్ (15) ఈ మ్యాచ్ లో విఫలం అయ్యాడు.

కర్ణాటకకు షాక్ ఇచ్చిన సౌరాష్ట్ర

ఇక మరో సెమీఫైనల్ మ్యాచ్ లో కర్ణాటక జట్టుకు సౌరాష్ట్ర షాకిచ్చింది. కర్ణాటకపై 5 వికెట్ల తేడాతో సౌరాష్ట్ర నెగ్గి ఫైనల్ కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు సౌరాష్ట్ర బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ 4 వికెట్లతో కర్ణాటకను దెబ్బ తీశాడు. దాంతో కర్ణాటక జట్టు 49.1 ఓవర్లలో కేవలం 171 పరుగులకే కుప్పకూలింది. రవికుమాార్ సమర్థ్ (135 బంతుల్లో 88; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1) నిరాశ పరిచాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌరాష్ట్ర 36.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది. జై గోహ్లి (82 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్), అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర ఓపెనర్లను ఆదిలోనే కోల్పోయింది. హర్విక్ దేశాయ్ (0), షెల్డన్ జాక్సన్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరుకున్నారు. అయితే జై జట్టును ఆదుకున్నాడు. అతడితో పాటు సమర్థ్ వ్యాస్ (33), ప్రేరక్ మన్కడ్ (35) రాణించడంతో సౌరాష్ట్ర విజయం ఖాయం అయ్యింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిసెంబర్ 2న జరిగే ఫైనల్లో సౌరాష్ట్రతో మహారాష్ట్ర తలపడనుంది.

First published:

Tags: Assam, Chennai Super Kings, Karnataka, Maharashtra

ఉత్తమ కథలు