Home /News /sports /

VIEWING PORNOGRAPHY IN ONLINE CLASSES BN

ఆన్‌లైన్ క్లాసుల్లో ఆశ్లీ చిత్రాలు.. ప్రముఖ క్రీడాకారుడు ఏం చేశాడంటే..

హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ట్రైనింగ్ సెంటర్
(ప్రతీకాత్మక చిత్రం)

హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ట్రైనింగ్ సెంటర్ (ప్రతీకాత్మక చిత్రం)

ఏం జరుగుతుందో అర్థం కాక తరగతులు వింటున్న వారు ఇబ్బందికర పరిస్థితిలో పడిపోయారు. అయితే తరచుగా అలాంటి చిత్రాలే వస్తుండడంతో లైవ్‌లో ఉన్న ప్రధాన గోపీచంద్ సైనౌట్ అయ్యారు.

    లాక్‌డౌన్ నేపథ్యంలో ఆన్‌లైన్ పాఠాలకు డిమాండ్ పెరిగింది. స్కూలు పిల్లల నుంచి క్రీడాకారుల వరకు అంతా ఆన్‌లైన్‌లోనే శిక్షణ పొందుతున్నారు. అందులో భాగంగానే భారత క్రీడాప్రాధికార సంస్థ(సాయ్), భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్(బాయ్)లు క్రీడాకారులకు ఆన్‌లైన్ పాఠాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఆ మేరకు బాయ్, సాయ్ ఆధ్వర్యంలో పాఠాలను మొదలుపెట్టారు. రోజువారీ లాగే గురువారం ఆన్‌లైన్ శిక్షణ మొదలుపెట్టారు. ఈ శిక్షణలో 500 మంది నుంచి 700 మంది వరకు ఉన్నారు. బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో ముమ్మరంగా శిక్షణ కొనసాగుతోంది. ఆయనతో పాటుగా ఇండోనేషియా కోచ్‌లు అగుస్ దివి సాంటోసో, నమ్రి సురోటో శిక్షణ ఇస్తున్నారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా అశ్లీల చిత్రాల కలకలం రేగింది. ఆన్‌లైన్ పాఠాలు వింటున్న వారందరి స్క్రీన్లపై అశ్లీల చిత్రాలు దర్శనమిచ్చాయి. ఆ సమయంలో కోచ్ సాంటోసో తరగతులు నిర్వహిస్తున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాక తరగతులు వింటున్న వారు ఇబ్బందికర పరిస్థితిలో పడిపోయారు. అయితే తరచుగా అలాంటి చిత్రాలే వస్తుండడంతో లైవ్‌లో ఉన్న ప్రధాన గోపీచంద్ సైనౌట్ అయ్యారు. దీనిపై ‘సాయ్’ ఐటీ విభాగంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్న సమయంలో ఫోర్న్ చిత్రాలు రావడానికి కారణాలు అన్వేషించే పనిలో పడింది. తమ జూమ్ సెషన్ హ్యాక్ కాకపోయినా పోర్న్ చిత్రాలు రావడం సాయ్ ఐటీ శాఖకు తలపోటుగా మారింది.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Badminton, Pullela Gopichand, Sports

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు