దేశవాళీ క్రికెట్లలో (Domestic Cricket) సంచలనం నమోదయ్యింది. హేమాహేమీలైన బౌలర్లకే సాధ్యంకాని ఫీట్‌ను ఒక యువ బౌలర్ సాధించాడు. టీ20 క్రికెట్లో (T20 Cricket) నాలుగు ఓవర్లు వేసి వికెట్లు తీయడమే గొప్ప అనుకుంటే.. విదర్భ ఆటగాడు దర్శన్ నల్కండే ఏకంగా ఒకే ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్లో డబుల్ హ్యాట్రిక్ (Double Hat-trick) తీసిన రెండో ఇండియన్ ప్లేయర్‌గా దర్శన్ ఘనత సాధించాడు. దీనికి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021 (Syed Mustaq Ali Trophy) సెమీఫైనల్ వేదికగా మారింది. శనివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో కర్ణాటక - విదర్భ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కర్ణాటక భారీ స్కోర్ దిశగా దూసుకొని పోయింది. ఓపెనర్లు రోహన్ కదమ్ (87), మనీశ్ పాండే (54) చెలరేగి ఆడారు. దీంతో తొలి వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం లభించింది. వీరి జోడీని లలిత్ యాదవ్ విడదీశాలు. అయితే ఆ తర్వాత వచ్చిన అభినవ్ మనోహర్ ఆ దూకుడును కొనసాగించాడు. అతడు క్రీజ్‌లో ఉంటే తప్పకుండా కర్ణాటక జట్టు 200 పరుగుల వరకు వచ్చేది.
అక్కడే విదర్భ బౌలర్ దర్శన్ నల్కండే మ్యాజిక్ చేశాడు. ఆఖరి వోవర్ వేయడానికి వచ్చిన నల్కండే తొలి బంతి డాట్ బాల్ వేశాడు. రెండో బంతికి అనిరుద్ద జోషి (1) యశ్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. మూడో బంతికి శరత్ బీఆర్ (0) అక్షయ్ వాడ్కర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక నాలుగో బంతికి జే సుచిత్ (0) వాంఖడేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దర్శన్ నల్కండే వికెట్ల వేట అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత బంతికి దూకుడు మీద ఉన్న అభినవ్ మనోహర్ (27) అథర్వ తైదేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇలా వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి దర్శన్ డబుల్ హ్యాట్రిక్ సాధించాడు.
MS Dhoni: నా చివరి మ్యాచ్ చెన్నైలోనే ఆడతా.. కానీ అది ఎప్పుడో తెలియదు.. రిటైర్మెంట్పై ధోనీ వ్యాఖ్యలు
— Simran (@CowCorner9) November 20, 2021
గతంలో భారత జట్టు మాజీ పేసర్ అభిమన్యు మిథున్ ఇలాంటి ఘనతనే సాధించాడు. 2019లో కర్ణాటక తరపున ఆడుతున్న సమయంలో హర్యాణాతో జరిగిన ఒక మ్యాచ్‌లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీశాడు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరలేదు. డబుల్ హ్యాట్రిక్ తీసిన తొలి భారత బౌలర్‌గా అభిమన్యు మిథున్ రికార్డులకు ఎక్కాడు. ఇక అంతర్జాతీయ స్థాయిలో మాత్రం డబుల్ హ్యాట్రిక్ ఘనత లసిత్ మలింగ పేరున ఉన్నది. 2019లో న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా నాలుగు వికెట్లు తీసి మలించ సంచలనం సృష్టించాడు. అంతకు ముందు గానీ.. ఆ తర్వాత గానీ అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఫీట్ ఎవరూ సాధించలేకపోయారు. ఇక దర్శన్ నల్కండే ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. గత రెండు సీజన్లలో అతడు పంజాబ్ జట్టుకు ఆడుతున్నా పెద్దగా అవకాశాలు రాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, Punjab kings