ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశలో అందరినీ ఆకట్టుకుంటున్న ఆటగాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer). మొదటి దశలో ఆడకపోయినా.. రెండో దశలో వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ధనాదన్ క్రికెట్‌కు తగిన ఓపెనర్‌గా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. వెంకటేశ్ అయ్యర్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే 27 బంతుల్లో 41 పరుగులు చేసి అందరినీ ఆకర్షించాడు. కోల్‌కతాకు ఒక మంచి ఆరంభం ఇవ్వడంలో వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) జరిగిన మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ కేవలం 49 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఒకవైపు కేకేఆర్ జట్టులో వికెట్లు పడుతున్నా.. తనదైన శైలిలో పంజాబ్ జట్టు బౌలర్లను ఎదుర్కుంటూ పరుగులు రాబట్టాడు. కేఎల్ రాహుల్, షారుక్ ఖాన్ రాణించడంతో కేకేఆర్ మ్యాచ్ ఓడిపోయింది. దీంతో వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్ వెలుగులోకి రాలేదు. మరోవైపు గత రెండు మ్యాచ్‌లుగా వెంకటేశ్ అయ్యర్ బౌలింగ్ కూడా చేస్తున్నాడు. నిలకడైన వేగంతో బౌలింగ్ చేస్తూ వికెట్లు కూడా తీస్తున్నాడు. ఒక పర్ఫెక్ట్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టుకు సేవలు అందిస్తున్నాడు.
వెంకటేశ్ అయ్యర్ సరిగ్గా మెగా వేలం ముందు అద్భుతంగా రాణిస్తుండటం అతడికి బాగా కలిసి వచ్చేలా ఉన్నది. వచ్చే ఏడాది అన్ని జట్లు మెగా వేలానికి వెళ్తున్నాయి. ఈ వేలంలో ఈ యువ ఆల్‌రౌండర్‌కు తప్పకుండా భారీ ధర వస్తుందని సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) అభిప్రాయపడుతున్నాడు. తాజాగా క్రిక్ఇన్ఫోకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మంజ్రేకర్ వచ్చే మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్‌కు వచ్చే ధర ఎంతో అంచనా వేశాడు. ఐపీఎల్ 2022కు నిర్వహించే వేలంలో వెంకటేశ్ అయ్యర్ కచ్చితంగా రూ. 12 కోట్ల నుంచి రూ. 14 కోట్ల వరకు ధర పలుకుతాడు. రెండో దశలో ధనాధన్ క్రికెట్ ఆడుతున్నాడని ఇలా చెప్పడం లేదని.. అతడి దేశవాళీ గణాంకాలు చూస్తే కూడా ఆ ధర వస్తుందని చెప్పగలనని మంజ్రేకర్ అన్నాడు.
IPL 2021 - Kira Narayanan : సొగసరి అందాలతో ఐపీఎల్ ఫ్యాన్స్ ను టీవీలకు కట్టిపడేస్తోన్న యాంకర్ కిరా..
వెంకటేశ్ అయ్యర్ ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్‌లో 47 సగటు కలిగి 92 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఇది కేవలం దేశవాళీ క్రికెట్ మాత్రమే.. ఇందులో ఐపీఎల్ గణాంకాలను కలపలేదు అని మంజ్రేకర్ అన్నాడు. దీన్ని బట్టి వెంకటేశ్ అయ్యర్ సామర్థ్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చని మంజ్రేకర్ చెబుతున్నాడు. వెంకటేశ్ అయ్యర్ కేవలం దూకుడుగా ఆడుకుంటూ వెళ్లే క్రికెటర్ మాత్రం కాదని అంటున్నాడు. అయ్యర్‌కు మ్యాచ్, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆడాలో తెలిసిన క్రికెటర్అని చెప్పాడు. వెంకటేశ్ అయ్యర్ రాబోయే ఐపీఎల్ సీజన్లలో ఏ జట్టుకు ఆడినా ఒక గేమ్ ఛేంజర్‌గా కొనసాగుతాడని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
ఇక వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆల్‌రౌండర్ కోసం పలు జట్లు ఎదురు చూస్తున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ తిరిగి అతడిని కొనుగోలు చేసిన ఆశ్చర్యపోనక్కరలేదు. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అతడిపై కన్నేశాయి. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు వచ్చే ఏడాది పూర్తిగా ఆటగాళ్లను మార్చేయాలని భావిస్తుండటంతో పాటు స్వదేశీ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో వెంకటేశ్ అయ్యర్ లాంటి క్రికెటర్లను జట్టులోకి తీసుకోవాలని జట్టు యాజమాన్యం వ్యూహం రచిస్తున్నది.
India Vs Pakistan : " విరాట్ కోహ్లీపై ఎక్కువ ఫోకస్ పెట్టకండి.. టీమిండియాలో అతడే మీ టార్గెట్ "
మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కు చెందిన వెంకటేశ్ అయ్యర్ 2015నుంచి రాష్ట్ర స్థాయి జట్టులో ఆడుతున్నాడు. చదువుల్లో చాలా ముందు ఉండే అయ్యర్.. మొదటిగా చార్టెడ్ అకౌంటెంట్ అవుదామని అనుకున్నాడు. అయితే క్రికెట్ కెరీర్‌కు అది అడ్డంకిగా మారుతుందని భావించి ఎంబీఏలో చేరాడు. వెంకటేశ్ అయ్యర్ ఆటను చూసిన కాలేజ్ లెక్చరర్లు.. అతడికి ఎంతో సాయం చేశారు. అటెండెన్స్ కోల్పోకుండా చూడటంతో పాటు నోట్సు కూడా తయారు చేసి ఇచ్చే వాళ్లంటా. మరి ఇలాంటి ఆల్‌రౌండర్ వచ్చే ఏడాది ఏ జట్టులోకి వస్తాడో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2021, Kolkata Knight Riders