Home /News /sports /

VENKATESH IYER LOVES WWE WANTS SIGNED BELT FROM UNDERTAKER BCCI SHARED A VIDEO JNK

Venkatesh Iyer-Undertaker: వెంకటేశ్ అయ్యర్ డబ్ల్యూడబ్ల్యూఈలో అండర్‌టేకర్ ఫ్యాన్.. అతడి కోరిక ఏంటో తెలుసా?

వెంకటేశ్ అయ్యర్ కోరిక ఏంటో బయటపెట్టిన బీసీసీఐ (PC: Instagram)

వెంకటేశ్ అయ్యర్ కోరిక ఏంటో బయటపెట్టిన బీసీసీఐ (PC: Instagram)

Venkatesh Iyer-Undertaker: వెంకటేశ్ అయ్యర్ డబ్ల్యూడబ్ల్యూఈలో అండర్‌టేకర్‌కి పెద్ద ఫ్యాన్. అతడు తన బెల్ట్‌పై ఆటోగ్రాఫ్ చేసి తనకు గిఫ్ట్ గా పంపాలని అయ్యర్ కోరుకుంటున్నాడు.

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 (IPL 2021) సెకెండ్ ఫేజ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight riders) తరపున ఆడిన వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) అద్భుత ప్రదర్శన చేశాడు. బ్యాటర్ గానే కాకుండా బౌలర్‌గా కూడా రాణించి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. దీంతో న్యూజీలాండ్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. తొలి టీ20లోనే అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. వెంకటేశ్ అయ్యర్ జాతీయ జట్టులోకి ఎంపికైన తర్వాత బీసీసీఐ (BCCI) ఒక వీడియోను షేర్ చేసింది. అందులో తన క్రికెట్ జర్నీ, తన జీవితం, ఇష్టాఇష్టాలు, కలల గురించి వెంకటేశ్ అయ్యర్ వెల్లడించారు. అందులో అందరినీ ఒక విషయం బాగా ఆకర్షించింది. అయ్యర్ చదువుల్లో చాలా ముందుంటాడు. అదే సమయంలో డబ్ల్యూడబ్ల్యూఈ అంటే వెంకటేశ్ అయ్యర్‌కు వల్లమాలిన అభిమానం. అతడికి మార్క్ కాలావే అంటే చాలా ఇష్టం. మార్క్ కాలావేని వరల్డ్ రెజ్లింగ్‌లో అండర్ టేకర్‌గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అతడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు తన మనసులో మాటను అయ్యర్ వీడియోలో చెప్పుకొచ్చాడు.

    అండర్ టేకర్‌కు తాను చాలా పెద్ద ఫ్యాన్ అని.. ఒకవేళ ఈ వీడియోను కనుక అతడు చూస్తే.. అతడు సైన్ చేసిన బెల్ట్ నాకు గిఫ్ట్‌గా ఇస్తే సంతోషిస్తానని అయ్యర్ అన్నాడు. అండర్ టేకర్ నా చిన్నప్పటి హీరో. నేను డబ్ల్యూడబ్ల్యూఈకి, అండర్ టేకర్‌కి పెద్ద ఫాన్య్‌ని. ఈ వీడయో చూసి అతడు నా కోరికను తీరుస్తాడని భావిస్తున్నానని అయ్యర్ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇక రెండు మ్యాచ్‌లలోనూ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన వెంకటేశ్ అయ్యర్‌కు భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం రాలేదు. ఓపెనర్లే రాణిస్తుండటంతో రెండు మ్యాచ్‌లలోనూ ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు.

    కివీస్ జట్టులో భారతీయులు.. దీపక్ పటేల్ నుంచి రచిన్ రవీంద్ర వరకు.. న్యూజీలాండ్‌కు ఆడిన తెలుగు క్రికెటర్ ఎవరో తెలుసా?



     వెంకటేశ్ అయ్యర్‌ను మంచి ఆల్ రౌండర్‌గా తీర్చిదిద్దడంతో పాటు మ్యాచ్ ఫినిషర్ పాత్రలో చూడాలని రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ఫామ్ లేక ఇబ్బంది పడుతుండటంతో అతడి స్థానంలో అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు బౌలింగ్ చేసే అవకాశం అయితే రాలేదు. ఇప్పటికే టీ20 సిరీస్ గెలవడంతో టీమ్ ఇండియా మూడో మ్యాచ్‌లో ప్రయోగాలు చేసే అవకశం ఉన్నది. ఆ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్‌కు బౌలింగ్ చేసే అవకాశం రావొచ్చు.

    Rahul Dravid: అప్పుడే రాహుల్ మార్క్.. రెండు మ్యాచ్‌లలో స్పష్టంగా కనపడిన వ్యూహాలు.. ఫినిషనర్‌ను వెతికే పనిలో కోచ్







    ఈ సారి ఐపీఎల్ కోసం మెగా ఆక్షన్ నిర్వహించనున్నారు. పలు జట్లు మంచి ఆల్ రౌండర్ కోసం వెతుకుతున్న నేపథ్యంలో వెంకటేశ్ అయ్యర్ వేలంలో భారీ ధర పలకవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌తో పాటు కొత్త జట్లు కూడా వెంకటేశ్ అయ్యర్‌పై కన్నేశాయి. పొట్టి ఫార్మాట్‌లోనే కాకుండా దేశవాళీ క్రికెట్‌లో వెంకటేశ్ అయ్యర్‌కు మంచి రికార్డులు ఉన్నాయి. దీంతో త్వరలో అతడు సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా ఆడాలని ఆసక్తి చూపిస్తున్నాడు.
    Published by:John Kora
    First published:

    Tags: Bcci, Kolkata Knight Riders, Team india, Wwe

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు