Home /News /sports /

VENKATESH IYER AND AVESH KHAN LIKELY TO DEBUT AS IND VS NZ T20 SERIES START TODAY JNK

IND vs NZ: న్యూజీలాండ్‌పై అరంగేట్రం చేయనున్న ఐపీఎల్ స్టార్స్.. సీనియర్ల గైర్హాజరీలో యువకులకు చోటు?

న్యూజీలాండ్‌పై ఇద్దరు క్రికెటర్ల అరంగేట్రం..? (PC: BCCI)

న్యూజీలాండ్‌పై ఇద్దరు క్రికెటర్ల అరంగేట్రం..? (PC: BCCI)

IND vs NZ: న్యూజీలాండ్‌తో నిర్వహిస్తున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగనున్నది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఐపీఎల్ స్టార్స్ టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేసే అవకాశం ఉన్నది.

    యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌ (T20 World Cup) సూపర్ 12 దశ (Super 12 Stage) నుంచే వెనుదిరిగిన టీమ్ ఇండియా (Team India).. అంచనాలకు అందకుండా ఫైనల్‌కు చేరి ఓడిపోని జట్టు న్యూజీలాండ్ (New Zealand). ఆ మెగా ఈవెంట్ ముగిసిన మూడు రోజులకే టీ20 సిరీస్‌లో తలపడుతున్నాయి. టీమ్ ఇండియా కొత్త కోచ్, కొత్త కెప్టెన్, కొత్త టీమ్‌తో బరిలోకి దిగుతున్నది. యువకులను బాగా ప్రోత్సహిస్తాడని పేరున్న రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కోచ్‌గా తొలి సిరీస్ కావడంతో టీమ్ ఇండియా ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2022 లక్ష్యంగా ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తుండటంతో ఈ సిరీస్‌లో కొత్త వారికి చోటు దక్కే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ 2021లో మెరిసిన యువ ఆటగాళ్లు అరంగేట్రం చేయవచ్చని తెలుస్తున్నది. సీనియర్ క్రికెటర్లు కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమి, రవీంద్ర జడేజా వంటి క్రికెటర్లు అందుబాటులో లేకపోవడంతో వారి స్థానాలను భర్తీ చేయగలిగే యువకులను ఛాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

    టీమ్ ఇండియాను గత కొన్నాళ్లుగా పట్టి పీడిస్తున్న ఆల్ రౌండర్ సమస్యకు ద్రవిడ్ పరిష్కారం కోసం వెతుకుతున్నాడు. హార్దిక్ పాండ్యాను బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టులో చాలా కాలం కొనసాగించారు. మొదట్లో అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న పాండ్యా.. వెన్నెముక శస్త్ర చికిత్స తర్వాత బౌలింగ్ చేయడం మానేశాడు. కేవలం స్పెషలిస్టు బ్యాటర్‌గా కొనసాగటానికి మొగ్గు చూపాడు. అయితే బ్యాటర్‌గా కూడా ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌లో విఫలం అయ్యాడు. దీంతో జట్టులో స్థానం కోల్పోయాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ ఉండటం వల్ల పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 6వ బౌలర్ కోసం వెతుక్కునే పని ఉండదు. అందుకే ఐపీఎల్‌లో రాణించిన వెంకటేశ్ అయ్యర్‌కు ఈ సిరీస్‌లో చోటు దక్కే అవకాశం ఉన్నది. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన అయ్యర్... అంచనాలకు మించి రాణించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనర్ నుంచి 7 వ నెంబర్ వరకు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న క్రికెటర్. అంతే కాకుండా బౌలింగ్ కూడా చేయగలడు. దీంతో అతడికి తొలి టీ20లో ఆల్‌రౌండర్ కోటాలో చాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

    Rahul Dravid Plan: రాహుల్ ద్రవిడ్ 5 పాయింట్ల ప్లాన్.. కరెక్ట్‌గా అమలైతే టీమ్ ఇండియాను కొట్టే వాడు ఉండడు






    ఇక పేసర్ భువనేశ్వర్ ఈ సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో స్థానం దక్కించుకుంటాడా లేదా అనేది అనుమానంగా మారింది. గత కొంత కాలంగా ఫామ్ లేక భువీ ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌లో పెద్దగా వికెట్లు కూడా తీయలేదు. ఒకప్పుడు స్వింగ్ కింగ్‌గా, డెత్ వోవర్ల స్పెషలిస్టుగా పేరున్న భువనేశ్వర్ ఇప్పుడు వికెట్లు తీయడానికి నానా కష్టాలు పడుతున్నాడు. అతడి స్థానంలో అవేశ్ ఖాన్‌కు స్థానం దక్కే అవకాశం ఉన్నది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అత్యధిక వికెట్లు తీశాడు. అంతే కాకుండా లీగ్‌లో సెకెండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా కూడా ఉన్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో వికెట్లు తీయడంలో ఆవేశ్‌ఖాన్‌కు మంచి అనుభవం ఉన్నది. ద్రవిడ్ కనుక కొత్త వారిని బరిలోకి దించాలనుకుంటే వీరిద్దరికీ ఇవ్వాళ్టి మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం దక్కవచ్చు.
    Published by:John Kora
    First published:

    Tags: India vs newzealand, IPL 2021, Rahul dravid, Rohit sharma, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు