Home /News /sports /

VARUN CHAKRAVARTHY CAN BE TEAM INDIA INDIA MAIN WEAPON AT WORLD T20 JNK GH

Team India: కోహ్లీసేనకు దొరికిన 'వరుణాస్త్రం'.. పొట్టి ప్రపంచకప్‌లో ప్రధాన అస్త్రంగా మారనున్న వరుణ్ చక్రవర్తి?

టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా సీక్రెట్ వెపన్ వరుణ్ చక్రవర్తి? (PC: IPL)

టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా సీక్రెట్ వెపన్ వరుణ్ చక్రవర్తి? (PC: IPL)

వరుణ్ చక్రవర్తి.. గత ఐపీఎల్ వరకు ఈ పేరు పెద్దగా భారత క్రికెట్ అభిమానులకు తెలిసి ఉండకపోవచ్చు. అయితే క్రితం సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోని వికెట్ తీసిన తర్వాత వరుణ్ చక్రవర్తి టాలెంట్ అందరికీ తెలిసింది.

వరుణ్ చక్రవర్తి (Varun chakravarthy).. గత ఐపీఎల్ (IPL) వరకు ఈ పేరు పెద్దగా భారత క్రికెట్ అభిమానులకు తెలిసి ఉండకపోవచ్చు. అయితే క్రితం సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీని (MS Dhoni) రెండు సార్లు ఔట్ చేసి మొదటి సారిగా అందరి దృష్టి తన వైపునకు తిప్పుకున్నాడు. అనంతరం కొద్దికాలంలోనే అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసి, తన లెగ్ స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు. ఈ ఐపీఎల్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight riders) తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో రానున్న టీ20 ప్రపంచకప్‌పై అంచనాలు పెంచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఫిట్నెస్ పరీక్షలో విఫలమైనప్పటికీ వెంటనే పుంజుకున్నాడు వరుణ్. ఈ ఐపీఎల్‌లో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ అద్భుత ప్రదర్శన చేసిన ఈ బౌలర్.. రానున్న ఐసీసీ ఈవెంట్లో తన పనితనం గురించి ముందే హింట్ ఇచ్చేశాడు. కోహ్లీ సేనకు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో వరుణ్ ప్రధాన బౌలర్‌గా మారే అవకాశం ఉంది.

* గతేడాది ధోనీ వికెట్ ఎలా తీశాడు?
వరుణ్ షార్ట్ ఔట్ సైడ్ ఆఫ్ దిశగా షార్ట్ లెంగ్త్ బాల్ వేయగా.. ఎక్స్ ట్రా కవర్ బౌండరీ కోసం చూసిన ధోనీ అనంతరం వెనక్కి తగ్గి ఫుల్ చేయబోయాడు. అయితే వెంటనే బంతి గిర్రున తిరిగి మిడిల్, లెగ్ స్టంపును గిరాటేసింది. మరోసారి ఆటగాళ్లిద్దరికి మంచి జ్ఞాపకంగా గుర్తుండిపోయింది. ఈ సారి వరుణ్ 107 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు.. అయితే ధోనీ బంతిని బ్యాట్‌కు మిడిల్ చేసే ప్రయత్నం చేయగా.. బంతి మిస్సై లెగ్ స్టంప్‌కు తగిలింది. దీంతో ఆశ్చర్యపోవడం కెప్టెన్ కూల్ వంతైంది.

* పెద్దగా సంబరాలు చేసుకోడు..
స్టార్ బ్యాటర్ వికెట్ తీస్తే ఏ బౌలరైనా సంబరాలు చేసుకోవడం సహజం. కానీ వరుణ్ చక్రవర్తి మాత్రం పెద్దగా పట్టించుకోడు. ఈ విషయాన్ని తన ఐపీఎల్ సహచరుడు ఆండ్రూ రసెల్ తెలిపాడు. "నేను వికెట్ తీసిన తర్వాత గట్టిగా అరుస్తా.. సంబరాలు చేసుకుంటా. కొన్నిసార్లు తర్వాత బంతివేయాలనే సంగతి కూడా మర్చిపోతా. కానీ వరుణ్ మాత్రం అలా కాదు. నా పద్ధతికి పూర్తి విరుద్ధం" అని రసెల్ స్పష్టం చేశాడు.

* ముంబయి ఇండియన్స్, ఆర్సీబీపై ప్రదర్శన..
ఈ రెండు మ్యాచుల్లోనూ వరుణ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. మొదటి మ్యాచ్‌లో 4 ఓవర్లకు 11 పరుగులు ఇవ్వగా.. తర్వాతి మ్యాచ్ లో 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముంబయి బ్యాటర్లు మొదట్లో ధాటిగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ సునీల్ నరైన్‌తో కలిసి వరుణ్ అడ్డకట్ట వేశాడు. ముఖ్యంగా గూగ్లీతో పాటు తన వేళ్ల మాయాజాలంతో బంతిని గింగిరాలు తిప్పుతూ ప్రత్యర్థిని అడ్డుకోగలిగాడు. బెంగళూరుపై మూడు వికెట్లు తీశాడు. గ్లేన్ మ్యాక్స్ వెల్, హజరంగా లాంటి మేటి బ్యాటర్ల వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

* ఎలాంటి పిచ్‌లకు ప్రాధాన్యమిస్తాడు?
తాను ఫ్లాట్‌గా ఉండే పిచ్ లపై బాగా రాణిస్తానని వరుణ్ ఇంతకు ముందే చెప్పాడు. ఈ ట్రాక్స్‌లో పేస్‌తో పాటు బంతి టర్న్ కూడా అవుతుందని పేర్కొన్నాడు. "నా శైలి బౌలింగ్ కు చెన్నై లాంటి టర్న్ అయ్యే పిచ్‌లు సూట్ కావు. కానీ ఫ్లాట్ ట్రాక్స్ బాగా సరిపోతాయి." అని తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే రానున్న ఐసీసీ ఈవెంట్ యూఏఈలో జరుగుతుండటం అతడితో పాటు టీమిండియాకు బాగా కలిసొచ్చే అంశం. ఎందుకంటే అక్కడ పిచ్ లన్నీ ఫ్లాట్ గానే ఉంటాయి.

* ఎడమ చేతివాటం బ్యాటర్‌లపై రాణిస్తాడా?
ఈ ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పాలి. ఎందుకంటే డేవిడ్ వార్నర్, నికోలస్ పూరన్ లాంటి ఆటగాళ్లను తన సామర్థ్యంతో పెవిలియన్ చేర్చాడు. గతేడాది గూగ్లీతో మిడిల్ స్టంప్ గిరాటేసి వార్నర్ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. డేవిడ్ వార్నర్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ బ్యాట్ లీడింగ్ ఎడ్జ్ తీసుకోవడంతో వికెట్ సమర్పించుకున్నాడు. అంతేకాకుండా నికోలస్ పూరన్, రిషబ్ పంత్ వికెట్లు కూడా తీశాడు.

* ఫిట్‌నెస్ విషయంలో...
గత మార్చిలో యోయో టెస్టులో వరుణ్ విఫలమవడంపై కోహ్లీ స్పందించాడు. "ప్రతి ఒక్కరూ టీమిండియా వ్యవస్థలను, వ్యక్తులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మేము ఫిట్నెస్, నైపుణ్యాల విషయంలో అత్యుత్తమ స్థాయిలో వర్క్ చేస్తున్నాం. అందుకే భారత్ క్రికెట్ లో అగ్రస్థానంలో ఉంది. టీమిండియాలో భాగం కావాలంటే ఆటగాళ్లు కమ్మిట్మెంట్ తో ఉండాలని ఆశిస్తున్నాను. ఆ విషయంలో ఎలాంటి రాజీకి చోటు లేదు." అని కోహ్లీ అన్నాడు. అంతకు ఓ రోజు ముందు కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్.. వరుణ్ గురించి ట్వీట్ చేశాడు. మనం చూసినదానికంటే అతనిలో ఎక్కువ నైపుణ్యాలు ఉన్నాయని అన్నారు.
Published by:John Naveen Kora
First published:

Tags: IPL 2021, Kolkata Knight Riders, T20 World Cup 2021, Team india

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు