Home /News /sports /

VAMIKA TO RCB GIRL 6 TIMES VIRAL PHOTOS FROM CRICKET STADIUM BROKE THE INTERNET GH VB

Cricket Viral Photos: గుట్కా మ్యాన్‌ నుంచి కోహ్లీ కూతురు వామిక వరకు.. క్రికెట్‌లో వైర‌ల్ అయిన ఫోటోలు, వీడియోలివే..

వైరల్ ఫొటోలు..

వైరల్ ఫొటోలు..

క్రికెట్ ఆట‌గాళ్ల‌కు మాత్రమే కాదు.. మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా చూడ‌టానికి వ‌చ్చిన అభిమానుల‌కు కూడా విప‌రీత‌మైన స్టార్‌డ‌మ్‌ను తీసుకొచ్చింది. అలాంటి వారిలో భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ- అనుష్క‌ల గారాల కూతురు వామిక (vamika), ఆర్సీబీ ఫ్యాన్ గ‌ర్ల్ ఉన్నారు. వారికి తెలియ‌కుండానే వారు సెల‌బ్రిటీలుగా మారారు.

ఇంకా చదవండి ...
క్రికెట్ (cricket).. మూడక్ష‌రాల ఈ ప‌దం దేశంతో సంబంధం లేకుండా ప్ర‌పంచ‌లోని క్రికెట్ అభిమానుల‌ను ఒక్క‌టి చేస్తుంది. టెన్ష‌న్‌గా సాగే మ్యాచ్‌లో జ‌ట్టును గెలిపించిన ఆట‌గాడు రాత్రికి రాత్రి హీరో అవుతాడు. అదే మ్యాచ్‌లో జ‌ట్టు ఓట‌మికి కార‌ణ‌మైతే జీరో (zero) అవ్వ‌డ‌మే కాకుండా అభిమానుల‌తో తిట్లు తినాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా భార‌త్‌లాంటి దేశంలో ఇటువంటివి చాలా సాధార‌ణంగా జ‌రుగుతూనే ఉంటాయి. అయితే క్రికెట్ ఆట‌గాళ్ల‌కు మాత్రమే కాదు.. మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా చూడ‌టానికి వ‌చ్చిన అభిమానుల‌కు కూడా విప‌రీత‌మైన స్టార్‌డ‌మ్‌ను తీసుకొచ్చింది. అలాంటి వారిలో భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ- అనుష్క‌ల గారాల కూతురు వామిక (vamika), ఆర్సీబీ ఫ్యాన్ గ‌ర్ల్ ఉన్నారు. వారికి తెలియ‌కుండానే వారు సెల‌బ్రిటీలుగా మారారు. దీనికి కార‌ణం వారి ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ కావ‌డ‌మే. ఇలా క్రికెట్ స్టేడియంలో వైర‌ల్ అయిన ఆరు ఫోటోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భార్య‌... కూతురు.. కోహ్లీ అర్ధ సెంచ‌రీ
ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మూడో వ‌న్డే ద్వారా విరాట్ కోహ్లీ-అనుష్క శ‌ర్మ‌ల కూతురు వామిక ఒక్క‌సారిగా ఇంట‌ర్నెట్ సూప‌ర్ స్టార్‌గా మారిపోయింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ అర్ధ సెంచ‌రీ పూర్తి చేసిన త‌ర్వాత‌... దానిని త‌న గారాల ప‌ట్టి వామిక‌కు అంకితం చేస్తున్న‌ట్లు ఊయ‌ల (Cardle) సెల‌బ్రేష‌న్ చేశాడు. స్టాండ్స్‌లో ఉన్నభార్య‌ అనుష్క శ‌ర్మ మురిసిపోగా... వామిక క్లాప్స్ కొడుతూ త‌న తండ్రికి అభినంద‌న‌లు తెలియ‌జేసింది. తర్వాత వామిక‌ ఫోటో నెట్లో విప‌రీతంగా ట్రెండ్ అయింది. ఎంత‌లా అంటే... త‌ల్లి అనుష్క నేరుగా రంగంలోకి దిగిన త‌న కూతురు ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయొద్దంటూ అభిమానుల‌ను కోరేంత వ‌ర‌కు..ఐదే సెకండ్లు.. ఆర్సీబీ ఫ్యాన్‌ గ‌ర్ల్ కాస్తా.. నేష్న‌ల్ క్ర‌ష్‌గా మారింది
2019 ఐపీఎల్ (IPL) సంద‌ర్భంగా జ‌రిగిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB), స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ద్వారా ఒక అమ్మాయి. భార‌త దేశంలోని యువ‌కుల‌కు క్ర‌ష్‌గా మారిందంటే మీరు న‌మ్ముతారా.. అవును అది నిజం. ఒక ఆర్సీబీ అభిమానిగా మ్యాచ్‌ను చూడ‌టానికి ఆమె స్టేడియానికి రాగా.. కెమెరా మ్యాన్ ఒక ఐదు సెకన్ల పాటు ఆమెను త‌న కెమెరా క‌ళ్ల‌లో బంధించాడు. ఇంకేముంది ఆమె ఒక్క‌సారిగా నేష్న‌ల్ క్ర‌ష్‌గా మారిపోయింది.

పాక్ అభిమాని బాధ‌... మీమ్‌గా మారింది
2019లో ఆస్ట్రేలియాలో జ‌రిగిన ఒక మ్యాచ్‌లో పాకిస్తాన్ జ‌ట్టు గెలిచే ద‌శ నుంచి ఓడిపోతుంది. దీన్ని జీర్ణించుకోలేని ఒక పాకిస్తాన్ అభిమాని త‌న న‌డుంపై చేతులు పెట్టుకొని నిరాశ‌, నిస్పృహ‌ల‌తో స్టాండ్స‌లో నిల‌బ‌డ‌టాన్ని కెమెరామ్యాన్ షూట్ చేశాడు. అంతే అత‌డి బాధ క్రికెట్‌లో ట్రెండీ మీమ్‌కు దారి తీసింది.ధోనీ.. నువ్వెక్కడుంటే నేన‌క్క‌డే
క‌రోనా వ‌ల్ల ఐపీఎల్‌-2021 రెండో అంచె యూఏఈలో జ‌రిగిన విష‌యం అంద‌రికీ తెల్సిందే. దుబాయ్ వేదిక‌గా కేకేఆర్‌ (KKR)తో చైన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) మ్యాచ్ జ‌రుగ‌గా... ధోని మ‌హిళా అభిమాని మ‌హీ తుమ్ జ‌హా హ‌మ్‌ వ‌హా (నువ్వెక్క‌డుంటే మేమ‌క్క‌డే) అనే బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శించింది. ఫోటోగ్రాఫ‌ర్ ఆమెను క్లిక్ మ‌నిపించ‌గా... నెట్టింట్లో అది తెగ వైర‌ల్ అయ్యింది.టెలిస్కోప్ సంచ‌ల‌నం
గ‌తేడాది జ‌రిగిన ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌నలో టీమిండియా ఆఫ్‌స్పిన్న‌ర్ అశ్విన్‌ను నాలుగో టెస్టు నుంచి త‌ప్పించారు. అప్ప‌ట్లో ఇది పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది కూడా. అయితే నాలుగో టెస్టు తొలి రోజు ఆట జ‌రుగుతున్న‌ప్పుడు అశ్విన్ భార్య ప్రీతి... టెలిస్కోప్‌తో ఉన్న త‌న కూతురు ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి... Looking For Ashwin… . Did She Find Her Father (లుకింగ్ ఫ‌ర్ అశ్విన్‌... డిడ్ సీ ఫైండ్ హ‌ర్ ఫాథ‌ర్) అని ట్యాగ్‌ చేసింది. దాంతో అశ్విన్ కూతురికి సెల‌బ్రిటీ హోదా వ‌చ్చేసింది.ప‌క్క‌న అమ్మాయి.. నోట్లో గుట్కా.. చేతిలో ఫోన్‌
అంద‌రూ మ్యాచ్‌ను ఒక‌లా చూస్తే.. ఈ యూపీ ఫ్యాన్ మాత్రం మ‌రో విధంగా చూశాడు. గ్యాంగ్‌స్ట‌ర్‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ప‌క్క‌న అమ్మాయి.. నోట్లో గుట్కా న‌ములుతూ.. మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ కెమెరా చేతికి చిక్కాడు. ఇంకేముంది.. మీమ్స్‌కు కార‌ణం అయ్యాడు. ఇదంతా గ‌తేడాది చివ‌ర్లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా జ‌రిగింది.
Published by:Veera Babu
First published:

Tags: Anushka Sharma, Trending, Trending news, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు