హోమ్ /వార్తలు /క్రీడలు /

Usain Bolt: ఉసేన్ బోల్ట్‌కు షాక్.. ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్ నుంచి రూ.80 కోట్లకు పైగా డబ్బు మాయం

Usain Bolt: ఉసేన్ బోల్ట్‌కు షాక్.. ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్ నుంచి రూ.80 కోట్లకు పైగా డబ్బు మాయం

Usain Bolt (PC : Instagram)

Usain Bolt (PC : Instagram)

Usain Bolt: జమైకన్ స్ప్రింట్ లెజెండ్ ఉసేన్ బోల్ట్ గురించి తెలియని వారు ఉండరు. సంచలన ప్రదర్శనలతో ఎనిమిది సార్లు ఒలింపిక్‌ మెడల్‌ సాధించిన బోల్డ్‌.. ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

జమైకన్ స్ప్రింట్ లెజెండ్ ఉసేన్ బోల్ట్ (Usain Bolt) గురించి తెలియని వారు ఉండరు. సంచలన ప్రదర్శనలతో ఎనిమిది సార్లు ఒలింపిక్‌ మెడల్‌ సాధించిన బోల్డ్‌.. ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడు. జమైకా స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (SSL)లో అతడు చేసిన భారీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ను కొందరు కాజేశారు. దీంతో బోల్ట్ ఇన్వెస్ట్ చేసిన తన రిటైర్‌మెంట్ ఫండ్‌ను కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఆ డబ్బు తిరిగి వస్తుందో లేదోనని బోల్ట్ ఆందోళన చెందుతున్నాడు.

* బోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మాయం

బోల్ట్ 2012లో జమైకన్ బ్రోకరేజీ ఫర్మ్ స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేసి పెట్టుబడి పెట్టాడు. అప్పటి నుంచి ఎప్పుడూ విత్‌డ్రా చేయలేదు. 2022 అక్టోబర్ 31న ఈ అకౌంట్‌లో 2 బిలియన్ల జమైకన్‌ డాలర్లు (సుమారు కోటి యూఎస్ డాలర్లు.. మన కరెన్సీలో రూ.81.2 కోట్లు) ఉండగా.. 2023 జనవరి 11న ఆ మొత్తం 1.8 మిలియన్ జమైకన్‌ డాలర్లుగా (రెండువేల యూఎస్ డాలర్లు.. మన కరెన్సీలో రూ.1.6లక్షలు) మారింది. పెద్ద మొత్తంలో నగదు మాయం కావడం వెనుక కంపెనీ వెల్త్‌ అడ్వైజర్‌ హస్తం ఉన్నట్లు తెలిసింది.

* పది రోజుల్లో చెల్లించాల్సిందే

జమైకా గ్లీనర్ వార్తాపత్రికతో బోల్ట్ మేనేజర్ నుజెంట్ వాకర్ మాట్లాడుతూ.. ఉసేన్‌ బోల్ట్‌ SSL కంపెనీలో 10 సంవత్సరాలకు పైగా పెట్టుబడి పెట్టాడని చెప్పారు. బోల్డ్‌ అకౌంట్‌లో తేడాలు గుర్తించామని, ఇప్పుడు బోల్ట్ మొత్తం పోర్ట్‌ఫోలియో రివ్యూ చేస్తున్నామని చెప్పారు. 2022 అక్టోబర్ నాటికి బోల్డ్‌ అకౌంట్‌లో ఉన్నట్లు చెబుతున్న 2 బిలియన్‌ జమైకన్‌ డాలర్లను చెల్లించడానికి SSLకి 10 రోజుల సమయం ఉంది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని బోల్డ్‌ న్యాయవాది లింటన్ గోర్డాన్ జనవరి 16న SSLకి పంపిన లేఖలో పేర్కొన్నారు. పది రోజుల్లోగా డబ్బు తిరిగి చెల్లించకపోయినా, డబ్బు బకాయి ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

బోల్ట్‌ పెట్టుబడులపై ఇప్పుడు జమైకన్ ఫైనాన్షియల్‌ అథారిటీస్‌ దర్యాప్తు చేస్తున్నారు. SSL సంస్థపై పూర్తి నిఘా ఉంచినట్లు జమైకా ఫైనాన్షియల్ సర్వీసెస్ కమీషన్(FSC) గత గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. FSC అనుమతి లేకుండా ఆస్తుల విక్రయాలు లేదా వ్యాపారం చేయకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది.

* కంపెనీ వెల్త్‌ అడ్వైజర్‌ మోసం

జమైకా అబ్జర్వర్ ప్రకారం.. భారీ కుంభకోణం బయటపెట్టే ముందు గత వారం కంపెనీ బోల్ట్ మేనేజ్‌మెంట్ టీమ్‌కు సమాచారం అందించింది. SSLలో ఓ వెల్త్ అడ్వైజర్ దాదాపు 30 మందికి పైగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ బాధితుల్లో బోల్ట్‌ కూడా ఉన్నాడు.

గత గురువారం SSL కంపెనీ మాజీ ఉద్యోగి మోసపూరిత కార్యకలాపాల గురించి తెలుసుకున్నట్లు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇంటర్నల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ తర్వాత, విషయాన్ని క్షుణ్ణంగా, పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. అవకతవకలను గుర్తించిన వెంటే ఆస్తులను అసెట్స్‌ను సెక్యూర్‌ చేయడానికి చర్యలు తీసుకున్నామని తెలిపింది. సాధ్యమైనంత తక్కువ సమయంలో అనుమానాస్పద యాక్టివిటీస్‌ గుర్తించడానికి ఇంటర్నల్‌ ప్రోటోకాల్స్ బలోపేతం చేసినట్లు పేర్కొంది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది.

* కంపెనీ తీరుపై అనుమానాలు

ఆగస్టులోనే మోసం గురించి SSL కంపెనీకి తెలుసని, అయినప్పటికీ ఆరోపణలు ఉన్న ఉద్యోగి గత బుధవారం వరకు కంపెనీలో పని చేశాడని కొన్ని నివేదికలు తెలిపాయి. బోల్ట్ ఇయర్లీ ఫైనాన్షియల్‌ పోర్ట్‌ఫోలియో రివ్యూ కోసం అతని టీమ్‌ గత డిసెంబర్‌లో SSL ప్రతినిధులతో సమావేశాన్ని అభ్యర్థించింది. ఈ తర్వాత SSL ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వ్యత్యాసాలను గుర్తించారు. బోల్ట్ టీమ్‌ విషయాన్ని SSL దృష్టికి తీసుకెళ్లిన తర్వాత సంబంధిత ఉద్యోగిపై దర్యాప్తు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే అప్పటి వరకు బోల్ట్ కూడా ప్రభావితం అయ్యాడని కంపెనీకి తెలియదు.

First published:

Tags: Bolt, Investments, Sports, Stocks

ఉత్తమ కథలు